Fact Check, Fake News, Telugu
 

తాజగా విజ్ఞాన్, గీతం, కోనేరు లక్ష్మయ్య ‘డీమ్డ్ టు బీ యూనివ‌ర్శిటీ’ హోదాని యూజీసీ రద్దు చేయలేదు, ఇది 2017 వార్త

0

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఈరోజు ఒక సంచలన నిర్ణయం తీసుకొందని, దేశ వ్యాప్తంగా 123 కాలేజీల ‘యూనివర్సిటీ’ హోదా రద్దు చేసిందని చెప్తూ, ‘విజ్ఞాన్, గీతం, కోనేరు లక్ష్మయ్య యూనివ‌ర్శిటీ హోదాల ర‌ద్దు’ అని ఆంధ్రప్రభ వారు ప్రచురించిన ఆర్టికల్ (ఆర్కైవ్డ్) ని చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్ (దావా): తాజగా విజ్ఞాన్, గీతం, కే ఎల్ ల ‘యూనివ‌ర్శిటీ’ హోదాను ర‌ద్దు చేసిన యూజీసీ.

ఫాక్ట్ (నిజం): విజ్ఞాన్, గీతం, కే ఎల్ ల ‘డీమ్డ్ టు బీ యూనివ‌ర్శిటీ’ (‘Deemed to be University’) హోదాని యూజీసీ రద్దు చేయలేదు. కేవలం వాటి పేర్లలో ‘యూనివర్సిటీ’ పదం వాడొద్దని చెప్పింది. కావాలంటే, ‘Deemed to be University’ అని బ్రాకెట్స్ లో రాసుకోవచ్చని 2017 లోనే యూజీసీ తెలిపింది; తాజాగా కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

దేశవ్యాప్తంగా 123 కాలేజీలకు యూనివర్సిటీ హోదా రద్దు చేస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏమైనా నిర్ణయం తీసుకుందా అని ఇంటర్నెట్ లో వెతకగా, 2017 లో ఈ విషయం పై కొన్ని వార్తాసంస్థలు ప్రచురించిన న్యూస్ ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చాయి. 123 కాలేజీల ‘డీమ్డ్ టు బీ యూనివ‌ర్శిటీ’ (‘Deemed to be University’) హోదాని యూజీసీ రద్దు చేయలేదని, కేవలం వాటి పేర్లలో ‘యూనివర్సిటీ’ పదం వాడొద్దని చెప్పిందని తెలుస్తుంది. కావాలంటే, ‘Deemed to be University’ అని బ్రాకెట్స్ లో రాసుకోవచ్చని 2017 లోనే యూజీసీ ఇచ్చిన ఆర్డర్ ని ఇక్కడ చూడవొచ్చు. మే 2020 లో అలాంటి ఆర్డర్ ఒకటి మళ్ళీ 127 ‘డీమ్డ్ టు బీ యూనివ‌ర్శిటీ’ లకు ఇచ్చినట్టు ఇక్కడ చూడవొచ్చు.

2017 లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని ఇక్కడ చదవొచ్చు.‘డీమ్డ్ టు బీ యూనివ‌ర్శిటీ’ హోదా ఉన్న కాలేజీలు ‘యూనివర్సిటీ’ అనే పదం వాడకుండా చూడమని యూజీసీ కి సుప్రీమ్ కోర్టు చెప్పింది.

యూజీసీ ‘డీమ్డ్ టు బీ యూనివ‌ర్శిటీ’ ల లిస్టులో విజ్ఞాన్, గీతం, కే ఎల్ కాలేజీల పేర్లు కూడా ఉన్నట్టు చూడవొచ్చు. కావున, ఆ కాలేజీలు తమ పేర్లలో ‘యూనివర్సిటీ’ అని పెట్టుకోకుండా ‘Deemed to be University’ అని పెట్టుకున్నట్టు వారి వెబ్ సైట్లలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) చూడవొచ్చు.

చివరగా, విజ్ఞాన్, గీతం, కే ఎల్ ల ‘డీమ్డ్ టు బీ యూనివ‌ర్శిటీ’ (‘Deemed to be University’) హోదాని యూజీసీ రద్దు చేయలేదు. కేవలం వాటి పేర్లలో ‘యూనివర్సిటీ’ పదం వాడొద్దని 2017 లో చెప్పింది, మళ్ళీ అదే విషయాన్నీ మే 2020లో పునరుద్ఘాటించింది.

Share.

About Author

Comments are closed.

scroll