‘బండి సంజయ్ గ్రానైట్ స్కాం. గ్రానైట్ వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసిన బండి సంజయ్’, అనే వార్తను టీవీ9 టెలికాస్ట్ చేసినట్టు చెప్తూ, టీవీ9 లోగో తో ఉన్న ఒక వీడియోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: బీజేపీ ఎంపీ బండి సంజయ్ గ్రానైట్ స్కాం చేసినట్టు టీవీ9 టెలికాస్ట్ చేసిన వార్త వీడియో.
ఫాక్ట్: పోస్ట్ లో పెట్టినది ఎడిట్ చేసిన వీడియో. తాము అలాంటి వార్తను అసలు టెలికాస్ట్ చేయలేదని, తమ లోగో తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేసామని టీవీ9 వారు వివరణ ఇచ్చారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లో పెట్టిన వార్త గురించి ఇంటర్నెట్ లో వెతకగా, అలాంటి వార్తను టీవీ9 టెలికాస్ట్ చేసినట్టు ఎక్కడా ఎటువంటి సమాచారం దొరకలేదు. తాము అలాంటి వార్తను అసలు టెలికాస్ట్ చేయలేదని, తమ లోగో తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేసామని టీవీ9 వారు వివరణ ఇచ్చారు. ఈ విషయం పై టీవీ9 వారు యూట్యూబ్ లో పెట్టిన వీడియోని ఇక్కడ చూడవొచ్చు.
బండి సంజయ్ ఆస్తుల విలువ 600 కోట్లు అని ‘వెలుగు’ మరియు ‘ఆంధ్రజ్యోతి’ వార్తలు ప్రచురించాయని చెప్తూ కొన్ని ఫోటోలు రెండు రోజుల క్రితం వైరల్ అవ్వగా, అవి కూడా ఎడిట్ చేయబడిన ఫోటోలని FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ ఇక్కడ చదవొచ్చు.
తన పై వస్తున్న అసత్య ప్రచారాల పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. బీజేపీ తెలంగాణ అధికారిక ట్విట్టర్ అకౌంట్ వారు కూడా ఈ విషయం పై ట్వీట్ చేసారు.
చివరగా, ‘బండి సంజయ్ గ్రానైట్ స్కాం’ అంటూ టీవీ9 ఎటువంటి వార్తను టెలికాస్ట్ చేయలేదు. అది ఒక ఎడిటెడ్ వీడియో.