Fake News, Telugu
 

“వజ్రాలు పొదిగిన బంగారు వాచ్” కథనం గురుంచి ఆంధ్రజ్యోతి ఆఫీసులో సిబ్బంది మాట్లాడిన వీడియో లీక్ అయింది అని షేర్ చేస్తున్న ఈ ‘Way2News’ వార్తా కథనం ఫేక్.

0

ఇటీవల ABN ఆంధ్రజ్యోతి ప్రచురించిన”వజ్రాలు పొదిగిన బంగారు వాచ్” కథనం ఫేక్ అని ఆంధ్రజ్యోతి ఆఫీసులో ఏబీఎన్ డెస్క్ ఇంచార్జిలు, సీనియర్ సబ్ ఎడిటర్ల మీటింగ్‌లో మాట్లాడిన వీడియో లీక్ అయింది అని చెప్తూ ‘Way2News’ పబ్లిష్ చేసిన వార్త కథనం ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ABN ఆంధ్రజ్యోతి ప్రచురించిన”వజ్రాలు పొదిగిన బంగారు వాచ్” కథనం ఫేక్ అని ఆంధ్రజ్యోతి ఆఫీసులో ఏబీఎన్ డెస్క్ ఇంచార్జిలు, సీనియర్ సబ్ ఎడిటర్ల మీటింగ్‌లో మాట్లాడిన వీడియో లీక్ అయింది -‘Way2News’ వార్తకథనం.

ఫాక్ట్ (నిజం): ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఇదే విషయాన్ని ‘Way2News’ సంస్థ X పోస్టు ద్వారా స్పష్టం చేసింది. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు .

వైరల్ పోస్టులో చెప్పిన విధంగా, ఆంధ్రజ్యోతి ఆఫీస్ వీడియో లీక్ సంబంధించిన రిపోర్ట్స్ ఏవీ లభించలేదు. ఈ క్రమంలోనే ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదని తెలిసింది. ఈ వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ (https://way2.co/d3k3fa) ద్వారా ‘Way2News’లో వెతికితే ఈ సంస్థ 10 ఆగష్టు 2023న “లిస్ట్‌-A క్రికెట్‌లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్లు” అనే టైటిల్‌తో ప్రచురించిన అసలైన వార్త దొరికింది.

పైగా, Way2News సంస్థ X పోస్ట్ ద్వారా “మా లోగోను ఉపయోగించి కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది మరియు ‘అటాచ్ చేసిన పోస్ట్’ వైరల్‌గా మారింది” అంటూ ఈ వార్త కథనం ఫేక్ అని వివరణ ఇచ్చింది.

చివరగా, “వజ్రాలు పొదిగిన బంగారు వాచ్” కథనం ఫేక్ అని ఆంధ్రజ్యోతి ఆఫీసులో సిబ్బంది మాట్లాడిన వీడియో లీక్ అయింది అని షేర్ చేస్తున్న ఈ ‘Way2News’ వార్తా కథనం ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll