Fake News, Telugu
 

సీనియర్ ఎన్టీఆర్ అసలైన వారసుడు నారా లోకేశ్ అని బాలకృష్ణ వ్యాఖ్యానించినట్టు షేర్ చేస్తున్న ఈ ‘Way2News’ వార్తా కథనం ఫేక్

0

ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడంపై నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇష్టానుసారంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనీ, అందుకే వాటిని తొలగించమని ఆదేశించాననీ, స్వర్గీయ ఎన్టీఆర్ అసలైన వారసుడు తన అల్లుడు నారా లోకేశే అని వ్యాఖ్యానించారు అని చెప్తూ ‘Way2News’ పబ్లిష్ చేసిన వార్త కథనం ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సీనియర్ ఎన్టీఆర్ అసలైన వారసుడు నారా లోకేశ్ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు -‘Way2News’ వార్తకథనం.

ఫాక్ట్ (నిజం): ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఇదే విషయాన్ని ‘Way2News’ సంస్థ X పోస్టు ద్వారా స్పష్టం చేసింది. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు .

వైరల్ పోస్టులో చెప్పిన విధంగా, ఎన్టీఆర్ అసలైన వారసుడు నారా లోకేశే అని బాలకృష్ణ వ్యాఖ్యానించారా అని  వెతికితే, బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యాలు చేసినట్టు రిపోర్ట్స్  ఏమి లభించలేదు. ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదని తెలిసింది. ఈ వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ (https://way2.co/d3k3fa) ద్వారా ‘Way2News’లో వెతికితే ఈ సంస్థ 10 ఆగష్టు 2023న “లిస్ట్‌-A క్రికెట్‌లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్లు” అనే టైటిల్‌తో ప్రచురించిన అసలైన వార్త దొరికింది.

పైగా, Way2News సంస్థ X పోస్ట్ ద్వారా “మా లోగోను ఉపయోగించి కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది మరియు ‘అటాచ్ చేసిన పోస్ట్’ వైరల్‌గా మారింది” అంటూ ఈ వార్త కథనం ఫేక్ అని వివరణ ఇచ్చింది.

చివరగా, సీనియర్ ఎన్టీఆర్ అసలైన వారసుడు నారా లోకేశే అని బాలకృష్ణ వ్యాఖ్యానించినట్టు షేర్ చేస్తున్న ఈ ‘Way2News’ వార్తా కథనం ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll