Fake News, Telugu
 

ఈ వైరల్ వీడియో కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయ ప్రాంగణంలో కన్నన్ అనే బాలుడు తిరుగుతున్న దృశ్యాలను చూపిస్తున్నది

0

కేరళలోని గురవాయుర్ శ్రీకృష్ణ దేవాలయంలో అద్భుతం,దేవాలయం మూసివేసిన తరువాత ఒక చిన్న పిల్లవాడు ఆలయం లోపల ఆడుకుంటూ కనిపించాడు. దేవాలయంలో విధులలో ఉన్న పోలీస్ ముందు నుండి వెళ్లినా పోలీస్ వారికి కనపడని బాలుడు. ఇది దేవస్థానములోని సిసి టివీలో రికార్డు అయింది. ఆలయం తెరిచినప్పుడు బాలుడు కనపడలేదు. ఎవరైనానూ తమ బాలుడు తప్పిపోయినట్లు ఎవరి నుండి ఫిర్యాదు లేదు. ఇది స్వామివారి లీలగా బాలుడు రూపంలో ఉన్నారని భక్తులు భావిస్తున్నారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో స్వామివారి(శ్రీకృష్ణుడు) బాలుడు రూపంలో ప్రత్యక్షం అయ్యాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో కనిపిస్తుంది వాగ్మిన్ జెబి ఇవ్యవాన్ అలియాస్ కన్నన్ అనే అనే బాలుడు. అతడు బాలుడు రూపంలో ఉన్న దేవుడు (శ్రీకృషుడు) కాదు. వివిధ వార్తా కథనాల ప్రకారం, మార్చి 2022లో కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయ ప్రాంగణంలో కన్నన్ తిరుగుతున్న దృశ్యాలను ఈ వీడియో చూపుతుంది. ఈ వీడియోను కన్నన్ యొక్క తండ్రి జెమిష్‌ తీశాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను మే 2022లో పలువురు సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వైరల్ వీడియోతో పాటు ఈ వీడియోకు సంబంధించిన మలయాళీ వార్త సంస్థ జన్మభూమి కథనాన్ని కూడా ఓ పోస్టులో షేర్ చేశారు. ఈ వీడియోల యొక్క వివరణల మరియు ఈ  వార్తాకథనం ప్రకారం, ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న బాలుడు పేరు వాగ్మిన్ జేబీ ఇవ్యవాన్ అలియాస్ కన్నన్ అని తెలుస్తుంది.

తదుపరి సంబంధిత మలయాళీ కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వీడియోకు సంబంధించి మలయాళీ మీడియా సంస్థ జన్మభూమి మే 2022లో పబ్లిష్ చేసిన వార్త కథనాన్ని కనుగొన్నాము. ఈ కథనం ప్రకారం, వైరల్ వీడియో వాగ్మిన్ జెబి ఇవ్యవాన్ అలియాస్ కన్నన్ అనే మూడున్నరేళ్ల బాలుడిని చూపిస్తుంది. ఈ బాలుడు దుబాయిలో నివసిస్తున్న కోజికోడ్‌లోని చెమంచెరికి చెందిన జెమిష్‌, బ్యూలా దంపతుల యొక్క కుమారుడు. కన్నన్ కు పుట్టుకతోనే మాట్లాడే శక్తి లేదు, కన్నన్ తల్లిదండ్రులు ఎందరో నిపుణులైన వైద్యులను సంప్రదించినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే, కన్నన్ యొక్క తల్లిదండ్రులు కన్నన్‌కి మాటలు రావాలని గురవాయుర్ శ్రీకృష్ణడుని ప్రార్థిస్తూ గురువాయూరప్పన్‌కి (గురవాయుర్ శ్రీకృష్ణడుకి) ఇష్టమైన కృష్ణనాట్టం భారతదేశానికి రాగానే సమర్పిస్తాం అని మొక్కారు. ఇలా మొక్కిన 3వ వారంలో కన్నన్ తన తల్లి బ్యూలాను “అమ్మా” అని పిలిచాడని, దీంతో కన్నన్ మరియు అతని తల్లిదండ్రులు మార్చ్ 2022లో  గురవాయుర్ వచ్చి గురువాయూరప్పన్‌కి కృష్ణనాట్టం సమర్పించారని, తెల్లవారుజామున 2 గంటల సమయంలో గురువాయూరప్పన్‌కు కృష్ణనాథం కాళీయమర్దనం కథను(వ కృష్ణనాట్టం) సమర్పించిన తర్వాత కన్నన్ గురువాయూర్ ఆలయ ప్రాంగణంలో తిరుగుతుండగా కన్నన్ తండ్రి జెమీష్ ఈ వీడియో తీశారని కన్నన్ తల్లి బ్యూలా జన్మభూమి పత్రికకు తెలిపారు.ఆ తరవాత ఈ వీడియో వైరల్ గా మారింది అని ఈ వార్త కథనం పేర్కొంది. ఇదే విషయాన్ని తెలియజేస్తున్న మరిన్ని వార్తాకథనాలను ఇక్కడ చూడవచ్చు.

కృష్ణనాట్టం అనేది శ్రీకృష్ణుని జీవితంలోని వివిధ భాగాలను నృత్య రూపంలో ప్రదర్శించడం. గురవాయుర్ ఆలయంలో శ్రీకృష్ణుని సమర్పించే నైవేద్యాలలో లేదా సమర్పణలలో ఈ కళారూపమైన కృష్ణనాట్టం సమర్పణ అనేది ముఖ్యమైనది. శ్రీకృష్ణుని జీవితంలోని ఎనిమిది కథలు ఆలయంలో వివిధ ప్రయోజనాల కోసం నైవేద్యంగా ప్రదర్శించబడతాయి. అవి సంతానం కోసం ‘అవతారం’, విషప్రభావాలను తొలగించేందుకు ‘కళీయమర్దనం’, పెళ్లికాని ఆడపిల్లల క్షేమానికి ‘రసక్రీడ’, దంపతుల మధ్య వివాదాలు సమాప్తం కావడానికి మరియు శత్రువులను తొలగించేందుకు ‘కంసవధం’, ‘స్వయంవరం’. సంతోషకరమైన దాంపత్యం, ప్రమాణాల నెరవేర్పు కోసం ‘బాణాయుధం’, పేదరికాన్ని తొలగించడానికి మరియు పొలాల నుండి దిగుబడిని పెంచడానికి ‘వివిధవాదం’ మరియు మరణించిన ఆత్మ యొక్క మోక్షానికి ‘స్వర్గారోహణం’ కథలను కృష్ణనాట్టంగా సమర్పిస్తారు.(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ)

చివరగా, ఈ వైరల్ వీడియో కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయ ప్రాంగణంలో కన్నన్ అనే బాలుడు తిరుగుతున్న దృశ్యాలను చూపిస్తున్నది.  

Share.

About Author

Comments are closed.

scroll