Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

కోవిడ్-19 చికిత్స కోసం ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులని షేర్ అవుతున్న ఈ లిస్టు ఫేక్

0

కోవిడ్-19 చికిత్స కోసం ప్లాస్మా అవసరమైతే, ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ లిస్టులోని వ్యక్తులను సంప్రదించండి అని చెప్తూ, కొన్ని పేర్లు, వాళ్ళ బ్లడ్ గ్రూప్లు మరియు ఫోన్ నెంబర్లతో కూడిన మెసేజ్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): కోవిడ్-19 చికిత్స కోసం ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తుల పేర్లు, బ్లడ్ గ్రూప్లు మరియు ఫోన్ నెంబర్లు.

ఫాక్ట్ (నిజం):  అవే పేర్లు, బ్లడ్ గ్రూప్లు మరియు ఫోన్ నెంబర్లతో కూడిన మెసేజ్ 2016 నుండి రక్తదానం చేసే వారి లిస్టుగా ఇంగ్లీష్ లో షేర్ అవుతుంది. ఇప్పుడు అదే లిస్టు ప్లాస్మా దానం చేసే వారి వివరలుగా షేర్ చేయబడుతుంది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని మెసేజ్ లో ఇచ్చిన వివరాల గురించి వెతకగా, అదే మెసేజ్ 2016 నుండి ఇంటర్నెట్ లో షేర్ అవుతున్నట్టుగా తెలిసింది. కానీ, అప్పుడు ఆ లిస్టు రక్తదానం చేసే వారి లిస్టుగా షేర్ చేయడింది; ప్లాస్మా దానం చేసే వారి లిస్టుగా కాదు. అదే లిస్టు 2017, 2018 మరియు 2019 లలో రక్తదానం చేసే వారి లిస్టుగా షేర్ చేయబడినట్టు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు.

లిస్టులోని ఫోన్ నెంబర్లకు కాల్ చేయగా, కొన్ని సర్వీస్ లో లేవు, మిగితా కాల్స్ ని ఎవరు ఎత్తలేదు. కోవిడ్-19 చికిత్స కోసం ఇతరులకు ప్లాస్మా దానం చేయాలంటే, కోవిడ్-19 వ్యాధి వచ్చి, దాని నుండి కోలుకొని ఉండాలి. 2016 నుండి వైరల్ అవుతున్న లిస్టులోని ఆ వ్యక్తులకే కరోనా వచ్చి, దాని నుండి వారు కోలుకొని, ప్లాస్మా దానం చేసే అవకాశం చాలా తక్కువ.  

చివరగా, కోవిడ్-19 చికిత్స కోసం ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులని షేర్ అవుతున్న ఈ లిస్టు ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll