స్కూల్ విద్యార్థులు సిగరెట్ తాగుతున్న వీడియో ని ఫేస్బుక్ లో చాలా మంది పోస్టు చేసి, అందులో ఉన్నది హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ గౌతం మోడల్ స్కూల్ విద్యార్థులని ఆరోపిస్తున్నారు. అది ఎంత వరకు నిజమో విశ్లేషిద్దాం.
ఆ పోస్టుని అక్టోబర్ 2018లో పెట్టినప్పటికీ, దానిని ప్రస్తుతం కూడా చాలా మంది షేర్ చేస్తున్నారు.
క్లెయిమ్: గౌతం మోడల్ స్కూల్ (హైదరాబాద్) విద్యార్థులు సిగరెట్ తాగుతూ కనిపిస్తున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపించే విద్యార్థుల యూనిఫామ్ గౌతం మోడల్ స్కూల్ ది కాదు. ఆ వీడియో గురించి గౌతం మోడల్ స్కూల్ (హైదరాబాద్) యాజమాన్యాన్ని సంప్రదించినప్పుడు, అది తమ స్కూల్ కి సంబంధించినది కాదని తెలిపారు. కావున, పోస్టులోని ఆరోపణ తప్పు.
పోస్టులోని వీడియోలో కనిపించే విద్యార్థుల యూనిఫామ్ గౌతమ్ మోడల్ స్కూల్ ది కాదు. గౌతమ్ మోడల్ స్కూల్ యూనిఫామ్ ని క్రింది ఫోటో లో చూడవాచ్చు.
ఆ వీడియో గురించి గౌతం మోడల్ స్కూల్(హైదరాబాద్) యాజమాన్యాన్ని FACTLY సంప్రదించినప్పుడు, అది తమ స్కూల్ కి సంబంధించినది కాదు అని వారు తెలిపారు.
వీడియో లో కనిపించే విద్యార్థులు వేసుకున్న యూనిఫామ్ మీద ‘CMS’ అనే లోగో ఉంది. దానితో వెతకినప్పుడు, అది లక్నో(ఉత్తర్ ప్రదేశ్) లోని సిటీ మోంటెస్సోరి స్కూల్ (CMS) యూనిఫామ్ ని పోలి ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఫేస్బుక్ లో కూడా చాలా మంది, ఆ వీడియోలో ఉన్నది లక్నో(ఉత్తర్ ప్రదేశ్) లోని సిటీ మోంటెస్సోరి స్కూల్(CMS) విద్యార్థులు అని పేర్కొన్నారు. ఆ పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరగా, వీడియోలో ఉన్నది గౌతం మోడల్ స్కూల్(హైదరాబాద్) విద్యార్థులు కాదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?