Fake News, Telugu
 

ఎడిటెడ్ ఫోటో పెట్టి, వారణాసి దీపావళి ఫోటో అంటూ ప్రచారం చేస్తున్నారు

1

వారణాసి లో దీపావళి రోజున తీసిన ఫోటో అని చెప్తూ ఒక ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వారణాసి దీపావళి ఫోటో. 

ఫాక్ట్ (నిజం): అది ఒక ఎడిటెడ్ ఫోటో. ఆకాశంలో కనిపిస్తున్న దీపాలను సాఫ్ట్ వేర్ సహాయంతో ఫోటోలో పెట్టారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.  

పోస్ట్ లోని ఫోటోని క్రాప్ చేసి యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఫోటోలో ఆకాశంలో కనిపిస్తున్న దీపాలు ఒక వాల్ పేపర్ నుండి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ‘Tokkoro’ అనే వెబ్ సైట్ లో అవే దీపాలతో ఉన్న వాల్ పేపర్ ఫోటోని చూడవొచ్చు. 

అమృత్సర్ స్వర్ణ దేవాలయం దీపావళి ఫోటో అని చెప్తూ ఇలాంటి ఫొటోనే ఇంకొకటి వైరల్ అయ్యింది. ఆ ఫోటో కూడా ఎడిటెడ్ ఫోటో అని FACTLY రాసిన ఫాక్ట్ చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ఎడిటెడ్ ఫోటో పెట్టి, వారణాసి దీపావళి ఫోటో అంటూ ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll