Fake News, Telugu
 

సంబంధంలేని పాత ఫోటోని కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ కి ముడిపెడుతున్నారు

0

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ నేపధ్యంలో రోడ్డుపై కూరగాయలు పడేసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ‘రైతులు పండించిన పంటను రోడ్డు పాలుచేసి,రైతులకోసము బందు నిర్వహించిన రాజకీయ పక్షాలు’ అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్:రైతులు పండించిన పంటను రోడ్డు పాలుచేసి, రైతులకోసము బందు నిర్వహించిన రాజకీయ పక్షాలు’.

ఫాక్ట్ (నిజం): ఇది ఒక పాత ఫోటో. ఈ ఫోటో కొత్త వ్యవసాయ చట్టాలు పార్లమెంట్ ఆమోదం పొందక ముందు నుండే ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోటోకి కొత్త వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ కి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని షేర్ చేసిన ఒక పాత సోషల్ మీడియా పోస్ట్ మాకు కనిపించింది.

ఇంకా రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఇదే ఫోటోని ప్రచురించిన ఒక బ్లాగ్ దొరికింది. ఈ బ్లాగ్ 09 మే 2020న రాయబడి  ఉంది. ఈ ఫోటోకి  సంబంధించి ఒరిజినల్ సోర్స్ గాని, ఈ ఫోటో ఏ సందర్భంలో తీసిందో తెలియనప్పటికీ ఈ ఫోటోని షేర్ చేసిన పాత సోషల్ మీడియా పోస్ట్, బ్లాగ్ బట్టి ఈ ఫోటో కొత్త వ్యవసాయ చట్టాలు పార్లమెంట్ ఆమోదం పొందక ముందు నుండే ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నదని చెప్పొచ్చు. దీన్నిబట్టి ఈ ఫోటోకి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన భారత్ బంద్ కి ఎటువంటి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా రైతులు భారత్ బంద్ నిర్వహించిన నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. 

చివరగా, సంబంధంలేని పాత ఫోటోని కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైలుతు పిలుపునిచ్చిన భారత్ బంద్ కి ముడిపెడుతున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll