Fake News, Telugu
 

టియర్ గ్యాస్ క్యాన్ ని తంతున్న వీడియో ఇండోనేషియాకి సంబంధించింది, బెంగాల్ కి కాదు

0

ఇటీవలే 08 అక్టోబర్ 2020న బెంగాల్ లో BJP కార్యకర్తలు సెక్రటేరియేట్ వరకు మార్చ్ నిర్వహించే కార్యక్రమంలో పోలీసులకి, BJP కార్యకర్తలకి మధ్య జరిగిన ఘర్షణల సందర్భంలో టియర్ గ్యాస్ కానిస్టర్ ని ఒక యువకుడు తంతున్న వీడియోని చూపిస్తూ ఆ కానిస్టర్ ని తంతున్నది BJP కార్యకర్త అని అర్ధం వచ్చేలా చెప్తున్న షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవలే 08 అక్టోబర్ 2020న బెంగాల్ లో BJP కార్యకర్తలు సెక్రటేరియేట్ వరకు మార్చ్ నిర్వహించే కార్యక్రమంలో పోలీసులకి, BJP కార్యకర్తలకి మధ్య జరిగిన ఘర్షణల సందర్భంలో టీయర్ గ్యాస్ కానిస్టర్ ని తంతున్న BJP కార్యకర్త.

ఫాక్ట్(నిజం): పోస్టులో ఉన్న వీడియోలోని పోలీస్ వాహనాలు ఇండోనేషియా పోలీస్ వాహనాలను పోలి ఉన్నాయి. ఈ  వీడియోని ఇండోనేషియాలో జరిగిన నిరసనలకు సంబంధించిందని చెప్తూ redfish అనే మీడియా సంస్థ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసింది. దీన్నిబట్టి ఈ వీడియోకి పశ్చిమ బెంగాల్ కి సంబంధంలేదని చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో ఉన్న వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని redfish అనే మీడియా సంస్థ తన పేస్ బుక్ లో షేర్ చేసిన పోస్ట్ కనిపించింది. ఈ పోస్టులో వీడియోకి సంబంధించిన వివరణ ప్రకారం ఈ వీడియో ఇండోనేషియాకి సంబంధిచిందని చెప్పొచ్చు. ఇదే వీడియోని తమ ట్విట్టర్ అకౌంట్లో కూడా షేర్ చేసారు.

పోస్టులో ఉన్న పోలీస్ వాహనాలు, ఇండోనేషియా పోలీస్ వాహనాలను పోలి ఉన్నాయి. ( రెండు వీడియోల్లో పోలీస్ వాహనాలపై ఒకే రంగులు చూడొచ్చు, ఇంకా రెండు వీడియోల్లో వాహనాలపై polisi అని రాసి ఉండడం చూడొచ్చు). ఐతే 08 అక్టోబర్ 2020న  ఇండోనేసియాలో ఒక చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఐతే పోస్టులో ఉన్న వీడియో ఈ నిరసనలకు సంబంధించిందో కాదో కచ్చితంగా చెప్పలేక పోవచ్చు గాని ఈ వీడియో ఇండోనేషియాకి సంబంధించిందని కచ్చితంగా చెప్పొచ్చు.

ఇటీవలే 08 అక్టోబర్ 2020న బెంగాల్ లో BJP కార్యకర్తలు సెక్రటేరియేట్ వరకు మార్చ్ నిర్వహించే కార్యక్రమంలో పోలీసులకి, BJP కార్యకర్తలకి మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో పోస్టులో ఉన్న వార్తలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, పోస్టులోని వీడియోకి, బెంగాల్ లో BJP కార్యకర్తలకి, పోలీసులకి  మధ్య జరిగిన ఘర్షణలకు ఎటువంటి సంబంధం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll