Fake News, Telugu
 

2009 లో తీసిన ఫోటోని చూపిస్తూ బీహార్ ఎన్నికల సందర్భంగా ఇందిరా గాంధీ చీర కట్టుకున్న ప్రియాంక గాంధీ అని షేర్ చేస్తున్నారు

0

బీహార్ లో ఎన్నికలు జరుగబోతున్న నేపధ్యంలో నాన్నమ్మ ఇందిరా గాంధీ చీర కట్టుకున్న ప్రియాంక గాంధీ, అంటూ షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బీహార్ ఎన్నికల నేపధ్యంలో నాన్నమ్మ ఇందిరా గాంధీ చీర కట్టుకున్న ప్రియాంక గాంధీ.

ఫాక్ట్ (నిజం):  2009 లోక్ సభ ఎన్నికల సమయంలో తన తమ్ముడు రాహుల్ గాంధీ పోటి చేస్తున్న అమేథి నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రియాంక గాంధీ అమేథి లోని దుర్గా మాత దేవాలయాన్ని సందర్శించారు. పోస్టులోని ఈ ఫోటో ఆ సందర్భంలో తీసినది అని విశ్లేషణలో తెలిసింది. ఈ ఫోటోకి బీహార్ లో జరగబోయే ఎన్నికలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులోని ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటోని ‘flickr’ వెబ్సైటులో ‘Pressbrief.in’ అనే ఛానల్ ‘12 ఏప్రిల్ 2009’ నాడు అప్లోడ్ చేసినట్టు తెలిసింది. 2009 లోక్ సభ ఎన్నికల సమయంలో తన తమ్ముడు రాహుల్ గాంధీ పోటి చేస్తున్న అమేథి నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రియాంక గాంధీ అమేథి లోని దుర్గా మాత దేవాలయాన్ని సందర్శించినట్టు, ఈ ఫోటో వివరణలో తెలిపారు. దీనికి సంబంధించి ‘Press Brief.in’ ఛానల్ ‘flickr’ వెబ్సైటులో పోస్ట్ చేసిన మరికొన్ని ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.

ప్రియాంక గాంధీ అమేథి లోని దుర్గా మాత దేవాలయాన్ని సందర్శించినప్పుడు తీసిన ఫోటోలని షేర్ చేస్తూ ‘Outlook India’ న్యూస్ వెబ్ సైట్ పబ్లిష్ చేసిన న్యూస్ గాలరీ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. ‘Getty Images’ వెబ్సైటులో కూడా ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేసారు. పోస్టులో షేర్ చేసిన ఇదే ఫోటోని కొందరు సోషల్ మీడియాలో 2018 లో పోస్ట్ చేసారు.

హత్రాస్ అత్యాచార ఘటనలో మరణించిన బాధితురాలికి న్యాయం జరగాలని, ఢిల్లీ లోని వాల్మీకి మందిరంలో చేసిన ప్రార్ధన కార్యక్రమానికి ప్రియాంక గాంధీ ఇటీవల హజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ ని ఇక్కడ , ఇక్కడ చూడవచ్చు.  పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోకి బీహార్ లో జరగబోయే ఎన్నికలకి ఎటువంటి సంబంధం లేదు.

చివరగా, 2009 లో తీసిన ఫోటోని చూపిస్తూ బీహార్ ఎన్నికల సందర్బంగా నాన్నమ్మ ఇందిరా గాంధీ చీర కట్టుకున్న ప్రియాంక గాంధీ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll