Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

వైద్య సిబ్బంది మరియు పోలీసుల నుండి ఒక వ్యక్తి పారిపోతున్న ఈ వీడియో కేరళకి సంబంధించింది

0

వైద్య సిబ్బంది మరియు పోలీసుల నుండి ఒక వ్యక్తి పారిపోతున్న వీడియోని సోషల్ మీడియా లో పోస్ట్ చేసి, ఆ ఘటన హైదరాబాద్ లో జరిగినట్టు షేర్ చేస్తున్నారు. గాంధీ హాస్పిటల్ లో వైద్యం సరిగ్గా అందిచరని ఆ వ్యక్తి పరిపోతున్నట్టు కొందరు పోస్ట్ (ఆర్కైవ్డ్) చేస్తే, మరికొందరు ఆ ఘటన కర్ణాటక లో జరిగినట్టు పోస్ట్ (ఆర్కైవ్డ్) చేసారు.ఆ పోస్ట్ లలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హైదరాబాద్ లో వైద్య సిబ్బంది మరియు పోలీసుల నుండి కొరోనా పాజిటివ్ వ్యక్తి పారిపోతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని వీడియో తెలంగాణకి లేదా కర్ణాటకకి సంబంధించినది కాదు. ఆ వీడియోలోని ఘటన కేరళలో జరిగింది. వీడియోలోని వ్యక్తి ఈ మధ్యనే సౌదీ అరేబియా నుండి వచ్చాడు. కాబట్టి, హోమ్ క్వారన్‌టైన్ లో ఉండాలి. రోడ్ల్ మీద తిరుగుతూ, క్వారన్‌టైన్ లోకి వెళ్ళడానికి నిరాకరించడంతో అలా బలవంతంగా వైద్య సిబ్బంది పట్టుకున్నారు. కావున, పోస్ట్ లలో కేరళలో జరిగిన ఘటన వీడియో పెట్టి, హైదరాబాద్ మరియు కర్ణాటక అని చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు..

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అలాంటి వీడియోనే సెర్చ్ రిజల్ట్స్ లోవస్తుంది. ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్’ వారు అదే వీడియోని 6 జూలై 2020 న తమ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసారు. వీడియోలోని ఘటన పతనంతిట్ట టౌన్ (కేరళ) లో జరిగినట్టు ఆ వీడియో వివరణలో చూడవొచ్చు. వీడియోలోని వ్యక్తి ఈ మధ్యనే సౌదీ అరేబియా నుండి వచ్చాడు. కాబట్టి, క్వారన్‌టైన్ లో ఉండాలి. అయితే, సోమవారం నాడు రోడ్డు మీద మాస్క్ లేకుండా పోలీసులకు కనిపించాడు. క్వారన్‌టైన్ లోకి వెళ్ళడానికి నిరాకరించడంతో అలా బలవంతంగా వైద్య సిబ్బంది పట్టుకున్నారు.ఆ ఘటనకి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు. కాబట్టి, వీడియోలోని ఘటన హైదరాబాద్ (తెలంగాణ) లో లేదా కర్ణాటక లో జరగలేదు.

చివరగా, వైద్య సిబ్బంది మరియు పోలీసుల నుండి ఒక వ్యక్తి పారిపోతున్న ఈ వీడియో కేరళకి సంబంధించింది.

Share.

About Author

Comments are closed.

scroll