Fake News, Telugu
 

2020లో స్మృతి ఇరానీ కాన్వాయ్‌ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తల వీడియోను ఇటీవలి నిరసనగా షేర్ చేస్తున్నారు

0

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ కారుకి ప్రజలు అడ్డుతగులుతూ నిరసన తెలుపుతున్న వీడియో అని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో స్మృతి ఇరానీకి ప్రజలు నిరసన తెలుపుతున్న వీడియో.

ఫాక్ట్: వీడియోలోని సంఘటన ఇటీవల జరిగింది కాదు, 2020లో జరిగింది. న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు హాత్రస్ అత్యాచార కేసు విషయంపై స్మృతి ఇరానీ యొక్క వాహనాలకు వారణాసిలో అడ్డుతగిలారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న ఒక వీడియో లభించింది. 03 అక్టోబర్ 2020న యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఈ వీడియోలో హాత్రస్ అత్యాచార కేసుకు నిరసనగా కాంగ్రెస్ వారు స్మృతి ఇరానీ ముర్దాబాద్ అంటూ నినాదాలు ఇచ్చి ఆమె కాన్వాయ్‌ని ఆపారని తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లోని హాత్రస్ జిల్లాలో 19 ఏళ్ల మహిళపై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా వారణాసిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాన్వాయ్‌ని కాంగ్రెస్ కార్యకర్తలు అక్టోబర్ 2020లో అడ్డుకున్నారని న్యూస్ రిపోర్ట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన రిపోర్ట్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడొచ్చు. నిరసన వ్యక్తం చేసిన పార్టీ కార్యకర్తలను తరువాత అరెస్టు చేసినట్లు కాంగ్రెస్ ప్రతినిధి లాలన్ కుమార్ తెలిపారు.

చివరగా, 2020లో స్మృతి ఇరానీ కాన్వాయ్‌ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తల వీడియోను పట్టుకొని, ఇటీవల స్మృతి ఇరానీకి నిరసన తెలుపుతున్న ప్రజలు అంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll