T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టీం ఇండియా ఓడింది అని భ్రమిస్తూ ఆనందం వ్యక్తం చేస్తూ, అంతలోనే సూర్య కుమార్ యాదవ్ బాల్ క్యాచ్ పట్టగానే నిరాశ వ్యక్తం చేస్తున్న భారతీయ మరకలు అంటూ ముస్లింలను ఉద్దేశిస్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్‌కు బదులుగా దక్షిణాఫ్రికాకు మద్దతు ఇస్తున్న భారతీయ ముస్లింలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో 11 జూన్ 2024 నుండి బంగ్లాదేశీలు, బంగ్లాదేశ్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరుతున్నT20 మ్యాచ్ లో మహ్మదుల్లా ఆటకు స్పందిస్తున్నట్టు ప్రచారంలో ఉంది. పైగా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ 10 జూన్ 2024న జరిగింది. ఇకపోతే, దక్షిణాఫ్రికా, భారత్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ 29 జూన్ 2024న జరిగింది. అంటే, దక్షిణాఫ్రికా, భారత్ ఫైనల్ మ్యాచ్ జరగడానికి చాలా రోజుల ముందు నుండే ఈ వీడియో ఇంటర్నెట్లో షేర్ అవుతోంది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తులు కలిగి ఉన్న వీడియో ఒకటి @iSoumikSabeb అనే ‘X’ ప్రొఫైల్లో ఇదే వీడియొ షేర్ చేస్తూ, “ఇది బంగ్లాదేశ్ అభిమానులు Vs దక్షిణాఫ్రికా. మహ్మదుల్లా షాట్ SA మ్యాచ్‌ను దాదాపుగా గెలిపించింది, కానీ దురదృష్టవశాత్తు బాల్ 2 అంగుళాలు దిగువన దిగి పట్టుబడింది. వాట్ ఎ డ్రమాటిక్ చేంజ్ ఆఫ్ ఎమోషన్స్” అంటూ షేర్ చెయ్యటం గమనించాం.
దీని గురించి మరింత వెతికితే, సాదిక్ జోమాద్దర్ రిఫాత్ అనే ఒక బంగ్లాదేశీ వ్యక్తి తన ఫేస్బుక్ ప్రొఫైల్లో 11 జూన్ 2024న ఈ వీడియో షేర్ చేసినట్టు గమనించాం. ఈ పోస్టుకు బెంగాలీ లిపిలో “బంగ్లాదేశ్ క్రికెట్ సోదరులు ఈ వ్యక్తుల అభిరుచి మరియు ప్రేమను చూడలేదా. మ్యాచ్ చివరిలో, రియాద్ బౌలింగ్‌లో మహ్మదుల్లా 6 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు మరియు బంగ్లాదేశ్ ఓడిపోయింది (అనువదించబడింది)” అని రాయటం గమనించాం. వైరల్ వీడియో మరియు ఒరిజినల్ వీడియోల మధ్య పోలీకను కింద చూడవచ్చు.

అయితే, ఈ వీడియో 11 జూన్ 2024 నుండి ప్రచారంలో ఉందని మేము కనుగొన్నాము. బంగ్లాదేశ్ మరియు దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ 10 జూన్ 2024న జరిగింది. అయితే, దక్షిణాఫ్రికా, భారత్ ఫైనల్ మ్యాచ్ 29 జూన్ 2024న జరిగింది. అంటే, దక్షిణాఫ్రికా, భారత్ ఫైనల్ మ్యాచ్ జరగడానికి చాలా రోజుల ముందు నుండే ఈ వీడియో ఇంటర్నెట్లో షేర్ అవుతోంది.

చివరిగా, ఇది T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్‌కు బదులుగా దక్షిణాఫ్రికాకు మద్దతు ఇస్తున్న భారతీయ ముస్లింల వీడియో కాదు.