Fake News, Telugu
 

ఈ వీడియోలో ఉన్న బాబా ఆరుసంవత్సరాలుగా ఏకధాటిగా యోగా సాధన చెయ్యట్లేదు

0

పద్మాసనంలో కూర్చొని, బూడిదతో కప్పబడి ఉన్న ఒక వ్యక్తి ఆరేళ్లుగా యోగా చేస్తున్న ఒక ఘోరా అని సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఈ క్లెయిమ్ వెనుక ఉన్న వాస్తవాన్ని తనిఖీ చేద్దాం.

క్లెయిమ్: ఆరేళ్లపాటు పద్మాసనంలో కూర్చున్న ఒక ‘ఘోరా’ యొక్క దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని వ్యక్తి బాబా ప్రహ్లాద్ గిరి జీ మహారాజ్. అతను ఇటీవల ‘పాంచ్ ధుని తపస్యా’ అనే తపస్సు చేసాడు, అది 41 రోజుల పాటు కొనసాగింది. వైరల్ వీడియోలో చెప్తున్నట్లు అతను ఆరేళ్లుగా ఏకధాటిగా యోగా చేయడం లేదు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

వైరల్ క్లిప్ గురించి మరింత తెలుసుకోవడానికి, మేము దానిలోని కొన్ని కీఫ్రేమ్‌లను ఉపయోగించి Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఈ శోధన మాకు ఒక YouTube వీడియోకి దారితీసింది. ఈ వీడియోలో వైరల్ వీడియోలో ఉన్నట్లుగా అదే మాదిరి సెటప్‌లో ఒక వ్యక్తి పద్మాసనంలో కూర్చున్నట్లు కనిపించాడు.

తన చుట్టును ఉన్న పిడకల గుంపు మరియు వెనుక ఉన్న బిల్డింగ్, చెట్లు, వైరల్ క్లిప్‌లోని దానితో సమానంగా ఉంటాయి. మీరు క్రింది కోలాజ్‌లో రెండు వీడియోల మధ్య సారూప్యతలను చూడవచ్చు.

ఈ వీడియో టైటిల్ ప్రకారం, ఇందులో ‘పాంచ్ ధుని తపస్సు’లో ఉన్న ‘శ్రీశ్రీ 1008 బాబా ప్రహ్లాద్ గిరి జీ మహారాజ్’ ఉన్నారు. అతని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మరియు యూట్యూబ్‌లోని అనేక వీడియోలు వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి నిజంగా ప్రహ్లాద్ గిరి జీ మహారాజ్ అని నిర్ధారించాయి. అతను ఇటీవల ‘పాంచ్ ధుని తపస్య’ చేసారు. ఇది 1 మే 2023న ప్రారంభమై 41 రోజుల పాటు కొనసాగింది. వైరల్ వీడియోలో పేర్కొన్నట్లుగా, అతను ఆరేళ్లుగా ఏకధాటిగా యోగా చేస్తున్నాడని అతని సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానెల్లో కానీ ఎటువంటి రుజువు లేదు.

అతని ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌లోని వీడియోలు (ఇక్కడ, ఇక్కడ ) అతను ఆరేళ్లుగా నిరంతరం యోగా భంగిమలో లేవనే సూచిస్తున్నాయి. వీటిల్లో, అతను ఇతర ప్రదేశాలను కూడా సందర్శించడం మనం చూడవచ్చు.

కావున, ఈ వీడియోలో ఉన్న బాబా ఆరేళ్లుగా యోగా సాధన చేయడంలేదు.

Share.

About Author

Comments are closed.

scroll