భారతదేశం నుండి ఒక కాకి పాకిస్తాన్‌కి వెళ్లి అక్కడి నుండి వంద రూపాయల నోటుని తీసుకొచ్చిందని చెప్తున్న ఒక యూట్యూబ్ వీడియోని ఎక్కువ మంది వీక్షిస్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోలో చెప్పేదాంట్లో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: భారతదేశం నుండి ఒక కాకి పాకిస్తాన్‌కి వెళ్లి అక్కడి నుండి వంద రూపాయల నోటుని తీసుకొచ్చింది.
ఫాక్ట్ (నిజం): వీడియోలో చెప్తున్నట్టు భారత దేశం నుండి ఒక కాకి పాకిస్తాన్‌కి వెళ్లి అక్కడి నుండి డబ్బు తీసుకోని వచ్చిందని చెప్పే వార్తా కథనాలు గాని లేక వేరే ఇతర సమాచారం గాని లేవు. ఐతే గతంలో పాకిస్తాన్ నుండి పావురాలు భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు అవి గూఢచర్యం కోసం వాడినవేమో అన్న అనుమానంతో పోలీసులు వాటిని అరెస్ట్ చేసిన ఘటనలు జరిగినప్పటికీ, వీడియోలో చెప్తున్నట్టు మన దేశం నుండి ఒక కాకి పాకిస్తాన్‌కి వెళ్లి అక్కడి నుండి డబ్బు తీసుకొని వచ్చిందని చెప్పే ఎటువంటి సమాచారం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ యూట్యూబ్ వీడియోలో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా ఇలా భారత దేశం నుండి ఒక కాకి పాకిస్తాన్‌కి వెళ్లి అక్కడి నుండి డబ్బు తీసుకొని వచ్చిందని చెప్పే వార్తా కథనాలు గాని లేక వేరే ఇతర సమాచారం గాని మాకు లభించలేదు. ఇది ఒక కల్పిత కథ అయ్యుంటుంది.
ఐతే గతంలో పాకిస్తాన్ నుండి పావురాలు భారత దేశంలోకి ప్రవేశించినప్పుడు, అవి గూఢచర్యం కోసం వాడినవేమో అన్న అనుమానంతో పోలీసులు వాటిని అదుపులోకి తీసుకున్న సందర్భాలున్నాయి. మార్చ్ 2020లో ఇలాగే పాకిస్తాన్ నుండి ఒక పావురం భారత్ లోని కాశ్మీర్ లోకి ప్రవేశిందింది. ఐతే ఆ పావురం కాలుకి ఉన్న రింగ్ పై ఎదో కోడ్ ఉండడంతో పోలీస్ ఆ పావురాన్ని స్పైగా భావించి అరెస్ట్ చేసారు. ఇలాగే 2015లో కూడా జరిగింది. ఇలాంటి సంఘటనలకి సంబంధించిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే ఇలా పాకిస్తాన్ నుండి పావురాలు భారత దేశంలోకి వచ్చిన సంఘటనల గురుంచి వార్తా సంస్థలు ప్రచురించాయి గాని ఒక కాకి భారత దేశం నుండి పాకిస్తాన్‌కి వెళ్లి అక్కడి నుండి వంద రూపాయల నోట్ తీసుకొచ్చిందని చెప్తూ ఎటువంటి వార్తా కథనాలు గాని లేక ఇతర సమాచారం గాని లేదు.
చివరగా, భారత దేశం నుండి ఒక కాకి పాకిస్తాన్‌కి వెళ్లి అక్కడి నుండి వంద రూపాయల నోట్ తీసుకొచ్చిందన్నది ఒక కల్పిత కథ.