Fake News, Telugu
 

ఫోటోలో ఉన్న శివలింగం అయోధ్య రామజన్మభూమి తవ్వకాల్లో లభించిన విగ్రహం కాదు

0

‘అయోధ్య రామజన్మభూమి తవ్వకాల్లో లభించిన ఐదు అడుగులున్న శివలింగం’ అని చెప్తూ, ఒక శివలింగం ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

.ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఫోటోలో ఉన్నది అయోధ్య రామజన్మభూమి తవ్వకాల్లో లభించిన ఐదు అడుగుల శివలింగం. 

ఫాక్ట్ (నిజం): ఆ ఫోటోని 2016 లో ప్రచురించిన న్యూస్ ఆర్టికల్ లోనే చూడవొచ్చు. అది ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ లో ఒక దేవాలయానికి సంబంధించిన శివలింగం. తాజగా అయోధ్య రామజన్మభూమిలో నిర్వహిస్తున్న పనుల్లో ప్రాచీన కట్టడాలు మరియు విగ్రహాలు బయట పడ్డట్టు వార్తలు వచ్చాయి. కానీ ఈ శివలింగం అక్కడిది కాదు. కావున పోస్ట్ లో అయోధ్య రామజన్మభూమికి సంబంధం లేని పాత ఫోటో పెట్టి తప్పుదోవ పట్టిస్తున్నారు. 

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోని 2016 లో ‘అమర్ఉజాల’ వారు ప్రచురించిన ఒక న్యూస్ ఆర్టికల్ లో చూడవొచ్చు. ఫోటోలోని శివలింగం ఉత్తరప్రదేశ్ లోని  ఫరూఖాబాద్ లో ఒక దేవాలయానికి సంబంధించినదని ఆ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.

అయితే, తాజగా అయోధ్య రామజన్మభూమిలో నిర్వహిస్తున్న పనుల్లో ప్రాచీన కట్టడాలు మరియు విగ్రహాలు దొరికాయి. వాటికి సంబంధించి వివిధ వార్తాసంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు

చివరగా, ఫోటోలో ఉన్న శివలింగం అయోధ్య రామజన్మభూమి తవ్వకాల్లో లభించిన విగ్రహం కాదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll