Fake News, Telugu
 

ఎక్స్‌-రేలో బతికున్న బొద్దింక కనిపించినట్టుగా షేర్ చేస్తున్న ఈ ఫోటో మార్ఫ్ చేయబడినది

0

ఒక పేషెంట్ ఛాతి ఎక్స్‌-రే తీయించుకుంటే అందులో బతికున్న బొద్దింక కనిపించింది, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ‘ఒక వ్యక్తి తనకు ఛాతీలో నొప్పిగా వుందని డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. డాక్టర్ ఎక్స్‌-రే తీసుకురమ్మన్నాడు. ఆ వ్యక్తి ఎక్స్‌-రే తీసుకువచ్చాడు. అది చూసిన డాక్టర్, నీ ఊపిరితిత్తులలో బతికున్న కాక్రోచ్ వుంది. దానిని సర్జరీ చేసి తీయాలి. ఆ సర్జరీ ఇక్కడ చేయలేరు అమెరికాకి వెళ్ళాల్సిందే అన్నాడు. ఆ వ్యక్తి అమెరికాకి వెళ్ళాడు. అక్కడ పరీక్ష చేసిన డాక్టర్లు కాక్రోచ్ ని ఊపిరితిత్తుల్లో కాదు, నీకు ఎక్స్‌-రే తీసిన మెషీన్లో వుంది, నీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్ అంతే అని పంపించేశారు’, అని ఈ పోస్టులో తెలిపారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: పేషెంట్ ఛాతి ఎక్స్‌-రేలో బతికున్న బొద్దింక కనిపించిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. ఈ ఫోటో కనీసం 2018 నుండి సోషల్ మీడియాలో వివిధ దేశాలకు జత చేస్తూ షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో ఫేక్ అని కంబోడియా ఆరోగ్య మంత్రుత్వ శాఖ కూడా స్పష్టం చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలతో పోలి ఉన్న ఫోటోలని కనీసం 2018 నుండి సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు తెలిసింది. ఆ పోస్టులని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ ఫోటోని 2018లో ముఖ్యంగా కంబోడియా దేశస్థులు ఖ్మేర్ భాషలో షేర్ చేసారు. కంబోడియా ప్రే వెంగ్ ప్రోవిన్సయాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఒక పేషెంట్, ఛాతి ఎక్స్‌-రేలో బతికున్న బొద్దింక వచ్చిందని భారత దేశానికి చికిత్స కోసం వెళ్ళగా, భారత డాక్టర్లు అతనితో బొద్దింక నీ ఊపిరితిత్తుల్లో కాదు, నీకు ఎక్స్‌-రే తీసిన మెషీన్లో ఉందని పేర్కొన్నట్టు ఈ పోస్టులలో తెలిపారు. ఈ ఫోటోని కంబోడియా దేశానికి చెందిన పలు మీడియా సంస్థలు కూడా షేర్ చేసాయి. 

అయితే, సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఈ ఫోటోపై కంబోడియా ఆరోగ్య మంత్రుత్వ శాఖ స్పష్టతనిస్తూ ఒక ప్రెస్ రిలీజ్‌ జారి చేసిందని ‘Khmer Times’ న్యూస్ సంస్థ 23 ఏప్రిల్ 2018 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఎక్స్‌-రే ఫోటో ఫేక్ అని కంబోడియా ఆరోగ్య మంత్రుత్వ శాఖ స్పష్టం చేసినట్టు ఈ ఆర్టికల్ రిపోర్ట్ చేసింది. ఈ ఫోటోని మొట్టమొదట షేర్ చేసిన కంబోడియా మీడియా సంస్థ ‘Merl Komsan’, ఈ ఫోటోని కేవలం సరదా కోసం సృష్టించిందని, ఒక ఆర్టికల్‌లోని ఫోటోని మరియు ఒక ఫేస్‌బుక్ పేజిలోని ఫోటోని జత చేస్తూ ఈ ఫోటోని రూపొందించామని ఒప్పుకున్నట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు. ఈ ఫోటోకి సంబంధించి ‘Merl Komsan’ మీడియా సంస్థ, కంబోడియా ప్రభుత్వాన్ని, కంబోడియా ప్రజలని క్షమాపణ కోరినట్టు ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు.

ఈ ఫేక్ ఫోటోకి సంబంధించి కంబోడియా ఆరోగ్య మంత్రుత్వ శాఖ ఇచ్చిన స్పష్టతను రిపోర్ట్ చేస్తూ మరికొన్ని కంబోడియా న్యూస్ సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినదని చెప్పవచ్చు.

ఇదివరకు, ఇవే దృశ్యాలతో పోలి ఉన్న మరొక ఎడిటెడ్ ఫోటోని, ఎక్స్‌-రేలో బతికున్న బొద్దింక కనిపించిందంటూ సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, FACTLY దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఎక్స్‌-రేలో బతికున్న బొద్దింక కనిపించినట్టుగా షేర్ చేస్తున్న ఫోటో మార్ఫ్ చేయబడినది.

Share.

About Author

Comments are closed.

scroll