Fake News, Telugu
 

లీ కువాన్ యూను భారత ప్రధాని మోదీతో పోలుస్తూ సింగపూర్ పత్రిక ఈ ఫోటో ప్రచురించలేదు; ఒక భారత అధికారి అన్న మాటలు

0

సింగపూర్‌ను అద్భుతమైన దేశంగా మార్చిన లీ కువాన్ యూను భారత ప్రధాని నరేంద్ర మోదీతో పోలుస్తూ సింగపూర్ పత్రిక ఫోటో ప్రచురించిందని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: లీ కువాన్ యూను నరేంద్ర మోదీతో పోలుస్తూ సింగపూర్ పత్రిక ఈ ఫోటో ప్రచురించింది.

ఫాక్ట్: ఈ ఫోటో మొదట ఎకనామిక్ టైమ్స్ పత్రికలో ప్రచురించారు. ప్రభుత్వంలో ఉన్న ఒక అధికారి నోట్ల రద్దు నిర్ణయం తర్వాత లీ కువాన్ యూను నరేంద్ర మోదీతో పోల్చారని ఆ ఆర్టికల్‌లో తెలిపారు. సింగపూర్ న్యూస్ వెబ్ సైట్ ‘ది ఇండిపెండెంట్’లో కూడా ఎకనామిక్ టైమ్స్ ఆర్టికల్‌లో ప్రచురించినట్టుగానే భారత ప్రభుత్వంలో ఉన్న ఒక అధికారి లీ కువాన్ యూను నరేంద్ర మోదీతో పోల్చారని తెలిపారు. సింగపూర్ పత్రిక అభిప్రాయం కాదు అది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఫోటో మొదట ఎకనామిక్ టైమ్స్ పత్రికలో ప్రచురించినట్టు తెలుస్తుంది. “Bombshell to recall Rs 500 & Rs 1,000 notes spelt out by PM Modi in March: Govt source” అనే టైటిల్‌తో ఉన్న ఆర్టికల్‌లో ఈ ఫోటో చూడొచ్చు. ఆ ఆర్టికల్‌లో, ప్రభుత్వంలో ఉన్న ఒక అధికారి, నోట్ల రద్దు నిర్ణయం తర్వాత లీ కువాన్ యూను నరేంద్ర మోదీతో పోల్చారని ఆ ఆర్టికల్‌లో తెలిపారు. కానీ, ఎక్కడా కూడా సింగపూర్ పత్రిక అలా అన్నట్టు లేదు.

ఇదే ఆర్టికల్ యొక్క ఆర్కైవ్ద్ వెర్షన్ చూసినప్పుడు ఫోటోలో ఉన్నట్టుగానే టైటిల్ ఉన్నట్టు చూడొచ్చు. కానీ, టైటిల్‌లో ‘Govt Source’ అని మాత్రమే ఉంది, ఎక్కడా కూడా సింగపూర్ పత్రిక అని లేదు.

సింగపూర్ న్యూస్ వెబ్ సైట్ ‘ది ఇండిపెండెంట్’లో కూడా ఎకనామిక్ టైమ్స్ ఆర్టికల్‌లో ప్రచురించినట్టుగానే భారత ప్రభుత్వంలో ఉన్న ఒక అధికారి, నోట్ల రద్దు నిర్ణయం తర్వాత లీ కువాన్ యూను నరేంద్ర మోదీతో పోల్చారని తెలిపారు.

HuffPost’ రాసిన ఆర్టికల్‌లో కూడా దీని గురించి కరెక్షన్ ఇచ్చారు. నోట్ల రద్దు తర్వాత, లీ కువాన్ యూను నరేంద్ర మోదీతో పోలుస్తూ సింగపూర్ లో బాగా షేర్ చేసారనే సమాచారం కరెక్ట్ కాదని తెలిపారు.

చివరగా, లీ కువాన్ యూను భారత ప్రధాని నరేంద్ర మోదీతో పోలుస్తూ సింగపూర్ పత్రిక ఈ ఫోటో ప్రచురించలేదు; భారత ప్రభుత్వంలో ఉన్న ఒక అధికారి అన్న మాటలివి.

Share.

About Author

Comments are closed.

scroll