“ఈ మెట్లు వాడినవారు ఎంత పెద్దగా వుంటారో” అని ఒక ఫోటో పెట్టి, ఆ ఫోటోని శ్రీలంక యొక్క రావణ కోట లో తీసినట్టు సోషల్ మీడియా కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: శ్రీలంక రావణ కోటలో తీసిన భారీ మెట్ల ఫోటో.
ఫాక్ట్: పోస్ట్ లోని ఫోటో శ్రీలంక కి సంబంధించింది కాదు. అది పెరూ దేశంలోని ‘Ollantaytambo’ టౌన్ లో ఉన్న ‘Terraces of Pumatallis’ ఫోటో. ‘Terraces of Pumatallis’ పక్కన పైకి మనుషులు నడవడానికి సామాన్య సైజులో మెట్లు ఉన్నాయి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఫోటోలోని ప్రదేశానికి సంబంధించిన చాలా ఫోటోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ఆ ఫోటో పెరూ దేశంలోని ‘Ollantaytambo’ టౌన్ లో తీసినట్టు తెలిసింది. ఫోటోలోని ప్రదేశాన్ని ‘Terraces of Pumatallis’ అని అంటారు.
సాధారణంగా అక్కడి ప్రజలు పాతకాలంలో టెర్రేస్ ఫార్మింగ్ చేసేవారు. ‘Terraces of Pumatallis’ పై కూడా టెర్రేస్ ఫార్మింగ్ చేసి ఉంటారని అని కొంత మంది భావిస్తే, మరికొందరు అది ఆంఫీథియేటర్ లాగా ఉందని తెలిపారు.
అంతేకాదు, ‘Terraces of Pumatallis’ పక్కన పైకి మనుషులు నడవడానికి తక్కువ సైజులో మెట్లు ఉన్నట్టు చూడవొచ్చు. ‘Ollantaytambo’ టౌన్ కి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవొచ్చు.
శ్రీలంకలో రావణ కోటగా భావించే ప్రదేశానికి సంబంధించిన వివరాలు ఇక్కడ చదవొచ్చు.
చివరగా, ఫోటోలో ఉన్నది పెరూ దేశంలోని ‘Ollantaytambo’ టౌన్ లో ఉన్న ‘Terraces of Pumatallis’.