Fake News, Telugu
 

కాలనీల్లో చేరిన వరద నీటిలో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్న వీడియోకి హన్మకొండ వరదలకి సంబంధంలేదు.

0

తెలంగాణలోని హన్మకొండలో వరదల వల్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా షేర్ చేస్తున్నారు, ఈ వీడియోలో కాలనీ లో వరద నీటి ప్రవాహానికి ఒక వ్యక్తి కొట్టుకు పోతుంటే కొందరు ఆ వ్యక్తిని పట్టుకునట్టు చూడొచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వరంగల్ లోని హన్మకొండలో కాలనీల్లో చేరిన వరద నీటిలో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్న వీడియో .

ఫాక్ట్(నిజం): పోస్టులో ఉన్న వీడియో జైపూర్ లోని నహార్ ఘర్ ప్రాంతంలో జరిగిన ఘటన. ఈ వీడియోకి హన్మకొండకి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురిసాయి. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ నగరాలలో అనేక అక్రమ కట్టడాలు నాలాలపై, చెరువు భూములపై ఉండడంతో భారీగా వరద నీరు వచ్చి చాలా కాలనీలు మునిగాయి.

భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో సంభవించిన వరదల వీడియోల కోసం యూట్యూబ్ లో వెతకగా, అచ్చం పోస్టులో ఉన్న వీడియో లాంటిదే ఒక వీడియో మాకు దొరికింది. ఈ వీడియోని 14 ఆగస్టు 2020న CNN-NEWS18 అనే వార్తా సంస్థ అప్లోడ్ చేసింది. ఐతే ఈ వీడియోలో చేప్తున్న దాని ప్రకారం ఈ ఘటన రాజస్తాన్ రాజధాని జైపూర్ లోని నహార్ ఘర్ ప్రాంతంలో జరిగింది. ఒక వ్యక్తి వరదల్లో కొట్టుకు పోతుంటే కొందరు స్థానికులు అతనిని రక్షించారు అని వీడియోలో చెప్తున్నారు. దీన్నిబట్టి ఈ వీడియోకి హన్మకొండలో సంభవించిన వరదలకి ఎటువంటి సంబంధంలేదని చెప్పొచ్చు.

ఈ ఘటనకి సంభందించిన మరొక న్యూస్ వీడియో ఇక్కడ చూడొచ్చు.

చివరగా, పోస్టులో ఉన్న వీడియో జైపూర్ లోని నహార్ ఘర్ ప్రాంతంలో జరిగిన ఘటనకి సంబంధించింది, హన్మకొండకు సంబంధం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll