మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాద్ రావు మృతి తరువాత, తన పై సాక్షి న్యూస్ ఛానల్ ‘పాపం పండింది’ అంటూ ఒక న్యూస్ ఐటమ్ ప్రసారం చేసిందని చెప్తూ ఒక ఫోటో ని ఫేస్బుక్ లో చాల మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ : కోడెల మృతి తరువాత ‘పాపం పండింది’ అంటూ న్యూస్ ప్రసారం చేసిన సాక్షి న్యూస్ ఛానల్.
ఫాక్ట్ (నిజం): ‘పాపం పండింది’ అంటూ కోడెల మీద సాక్షి ఛానల్ న్యూస్ ప్రసారం చేసింది ఆగష్టు 24న, కోడెల మృతి చెందింది సెప్టెంబర్ 16న. కావున, సాక్షి ఛానల్ ఆగష్టు నెలలో ప్రసారించిన వార్తను తీసుకొని, కోడెల చనిపోయాక ప్రసరించినట్టు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
పోస్ట్ చేసిన ఫోటోలో ‘పాపం పండింది’ అని రాసి ఉన్నట్టు చూడవచ్చు. కావున గూగుల్ లో ‘పాపం పండింది కోడెల’ అని వెతకగా, సాక్షి న్యూస్ ఛానల్ వారు తమ యూట్యూబ్ ఛానల్ లో పెట్టిన వీడియో ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ వీడియోలో నుండే పోస్ట్ చేసిన ఫోటో తీసుకున్నట్టు చూడవచ్చు. కానీ, ఆ వీడియోని అప్లోడ్ చేసిన తేదీ చూడగా, దాన్ని సాక్షి న్యూస్ ఛానల్ వారు ఆగష్టు 24న అప్లోడ్ చేసినట్టు తెలుస్తుంది. కోడెల చనిపోయింది సెప్టెంబర్ 16న. కావున, చనిపోక ముందు ప్రసారమైన న్యూస్ ఫోటో పెట్టి, కోడెల చనిపోయాక ప్రసారమైన న్యూస్ గా ప్రచారం చేస్తున్నారు.
చివరగా, పాత న్యూస్ ఫోటో పెట్టి, కోడెల చనిపోయాక ‘పాపం పండింది’ అంటూ సాక్షి ఛానల్ ప్రసారం చేసినట్టు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Idi kavachhu but sachhu sakshi anni puchhu news chebutundi