Fake News, Telugu
 

‘బీహార్ లో మసీదుకి శక్తులు రావాలని హిందూ బాలుడిని బలిచ్చారు’ అనేది తప్పుడు వార్త అని తెలిపిన బీహార్ డీజీపీ

0

బీహార్ లో కొత్త మసీదు ప్రారంభానికి రోహిత్ అనే 15 సంవత్సరాల హిందూ బాలుడిని బలిచ్చిన ముస్లింలు’ అని చెప్తూ, ఒక న్యూస్ ఆర్టికల్ లింక్ తో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: బీహార్ లో కొత్త మసీదుకి శక్తులు రావాలని ఒక హిందూ మైనర్ బాలుడిని ముస్లింలు బలిచ్చారు. 

ఫాక్ట్ (నిజం): రోహిత్ కేసులో మసీదు కోసం బలిచ్చారనే మతపరమైన కోణం లేదని బీహార్ డీజీపీ తెలిపారు. ఆ ఊర్లో అసలు మసీదు లేదని, రోహిత్ ని బలిచ్చారు అని చెప్పడానికి తన ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని తెలిపారు. పోస్ట్ మార్టంలో కూడా నీళ్లలో మునగడం వల్ల రోహిత్ చనిపోయినట్టు తేలిందని, అయితే తనని ఎవరైనా కావాలని నీళ్లలో పడేసారా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనేది విచారణ జరుపుతున్నామని తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు

పోస్టులో ఇచ్చిన న్యూస్ లింక్ ని ఓపెన్ చేయగా, ఆ న్యూస్ ఆర్టికల్ లో కొత్తగా ‘అప్డేట్’ జోడించినట్టు చూడవచ్చు. దాని తెలుగు అనువాదం – ‘తాము జరిపిన దర్యాప్తులో రోహిత్ జైస్వాల్ మరణంలో మతపరమైన కోణం లేదని బీహార్ డీజీపీ చెప్పారు. బాధితుడి తండ్రి తన ప్రకటనలను చాలా సార్లు మార్చారు. ముస్లింలు మసీదును శక్తివంతం చేయడానికి తన కొడుకును బలి ఇచ్చారని తండ్రి ఆరోపించారు, కానీ పోలీసుల దర్యాప్తులో అది అవాస్తవమని తేలింది. చివరికి, తండ్రి కూడా ఆ ఆరోపణలను ఖండించారు’.

ఈ కేసుకు సంబంధించిన వివరాలు చెప్తూ, బీహార్ డీజీపీ తన ఫేస్బుక్ అకౌంట్ లో లైవ్ వీడియో పెట్టారు. తను స్వయంగా ఆ ఊరికి వెళ్లి అందరితో మాట్లాడానని, రోహిత్ ని మసీదు కోసం బలిచ్చరనేది తప్పుడు న్యూస్ అని తెలిపారు. ఆ ఊర్లో అసలు మసీదు లేదని, రోహిత్ ని బలిచ్చారు అని చెప్పడానికి తన ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని తెలిపారు. పోస్ట్ మార్టంలో కూడా నీళ్లలో మునగడం వల్ల రోహిత్ చనిపోయినట్టు తేలిందని, అయితే తనని ఎవరైనా కావాలని నీళ్లలో పడేసారా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనేది విచారణ జరుపుతున్నామని తెలిపారు. మార్చిలో ఈ ఘటన జరిగినప్పుడు వార్తా సంస్థలు అన్నీ రోహిత్ నదిలో మునిగి చనిపోయినట్టు రిపోర్ట్ చేసారు, కానీ తరువాత కొన్ని న్యూస్ పోర్టల్స్ మాత్రం తనని మసీదు కోసం బలిచ్చారని తప్పుగా ప్రచారం చేసారని డీజీపీ తెలిపారు.

చివరగా, ‘బీహార్ లో మసీదుకి శక్తులు రావాలని హిందూ బాలుడిని బలిచ్చారు’ అనేది తప్పుడు వార్త అని తెలిపిన బీహార్ డీజీపీ.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll