Fake News, Telugu
 

బంగ్లాదేశ్‌ ముస్లిం మత సంస్థ హిందూ అమ్మాయిల మత మార్పిడికి రేట్లు నిర్ణయించిందంటూ షేర్ చేస్తున్న ఈ లెటర్ డిజిటల్‌గా మార్ఫ్ చేసింది

0

బంగ్లాదేశ్‌లో హిందూ అమ్మాయిని మతం మారిస్తే బహుమతిగా డబ్బు ఇస్తున్నారంటూ బెంగాలీలో ఉన్న ఒక సర్కులర్ యొక్క ఇంగ్లీష్ అనువాదం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). బంగ్లాదేశ్ జమియత్ అహ్ల్-అల్-హదీత్ పేరుతో షేర్ అవుతున్న ఈ సర్కులర్‌లో దళిత అమ్మాయికి యాభై వేలు, భారతీయ బెంగాలీ అమ్మాయికి రెండు లక్షలు, బ్రాహ్మణ అమ్మాయికి మూడు లక్షలు అంటూ పలు రకాల రేట్ల వివరాలు ఇందులో షేర్ చేసారు. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.


ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: బంగ్లాదేశ్ జమియత్ అహ్ల్-అల్-హదీత్ హిందూ అమ్మాయిని మతం మారిస్తే బహుమతిగా డబ్బు ఇస్తామంటూ పేర్కొన్న సర్కులర్.

ఫాక్ట్(నిజం): ప్రస్తుతం షేర్ అవుతున్న సర్కులర్‌ను డిజిటల్‌గా మార్ఫ్ చేసి రూపొందించారు. జమియత్ అహ్ల్-అల్-హదీత్ సంస్థ ఫిబ్రవరి 2022లో ముస్లింలలో ఖురాన్, హదీను విద్యను ప్రోత్సహించడానికి సంబంధించి విడుదల చేసిన సర్కులర్‌ను డిజిటల్‌గా ఎడిట్ చేసి హిందూ అమ్మాయిల మతమార్పిడి ప్రస్తావనను చేర్చారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ప్రస్తుతం షేర్ అవుతున్న సర్కులర్ బంగ్లాదేశ్‌కు చెందిన జమియత్ అహ్ల్-అల్-హదీత్ విడుదల చేసిందే అయినా నిజానికి అందులో హిందూ అమ్మాయిల మతం మారిస్తే డబ్బు చెల్లించే విషయానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు.

ప్రస్తుతం షేర్ అవుతున్న సర్కులర్‌కు (బెంగాలీ) సంబంధించిన రిఫరెన్స్ నెంబర్, తేదీ వివరాల బట్టి  జమియత్ అహ్ల్-అల్-హదీత్ వెబ్‌సైట్‌లో వెతకగా ఈ వివరాలతో మ్యాచ్ అయిన సర్కులర్ మాకు లభించింది (ఆర్కైవ్డ్). ఐతే ఈ సర్కులర్‌లో హిందూ అమ్మాయిల మత మార్పిడికి సంబంధించి ఎటువంటి ప్రస్తవన లేదు. అంతకు ముందు 05 ఫిబ్రవరి 2022 నాడు కౌన్సిల్ మీటింగ్‌లో ముస్లింలలో ఖురాన్, హదీను విద్యను ప్రోత్సహించాలని తీసుకున్న నిర్ణయాలను ఈ సర్కులర్‌లో ప్రస్తావించారు. ఈ సర్కులర్ యొక్క ఇంగ్లీష్ అనువాదం కింద చూడొచ్చు.

దీన్నిబట్టి ఈ ఒరిజినల్ సర్కులర్‌ టెంప్లేట్‌ను డిజిటల్‌గా ఎడిట్ చేసి హిందూ అమ్మాయిల మత మార్పిడికి సంబంధించిన రేట్ల వివరాలు చేర్చారని అనుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఏదైనా సంస్థ విడుదల చేసే అధికారిక డాక్యుమెంట్‌లతో పోలిస్తే ప్రస్తుతం షేర్ అవుతున్న సర్కులర్‌లో చాలా తప్పులు ఉన్నాయి. విషయానికి, ‘ధన్యవాదాలు’ ఒకే లైన్‌లో ఉండడం, లెటర్ ఎవరికీ రాస్తున్నారో అన్న సమాచారం మరియు హెడ్డింగ్ ఒకే లైన్‌లో ఉండడం మొదలైన తప్పులు ప్రస్తుతం షేర్ అవుతున్న లెటర్‌లో గమనించొచ్చు. సాధారణంగా ఒక సంస్థ విడుదల చేసే అధికారిక సర్కులర్‌లో ఇలాంటి తప్పులు చేయరు.

కాబట్టి ఈ సర్కులర్‌ను డిజిటల్‌గా ఎడిట్ చేసి రూపొందించినట్టు స్పష్టమవుతుంది. పైగా ఒకవేళ నిజంగా ఆ సంస్థ ఇలా హిందూ అమ్మాయిల మత మార్పిడికి సంబంధించి ఒక సర్కులర్ విడుదల చేసి ఉంటే బంగ్లాదేశీ లేదా భారత మీడియాలో విస్తృతంగా రిపోర్ట్ అయి ఉండేది. కానీ మాకు అలాంటి కథనాలేవి కనిపించలేదు.

చివరగా, బంగ్లాదేశ్‌కు చెందిన ముస్లిం మత సంస్థ హిందూ అమ్మాయిల మత మార్పిడికి రేట్లు నిర్ణయించారంటూ ఒక డిజిటల్‌గా మార్ఫ్ చేసిన లెటర్‌ను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll