కొంతమంది అగ్రదేశ నాయకులతో మోడీ ఉన్నట్లుగా కనిపిస్తున్న ఒక ఫోటో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ‘ఈ దేశానికి నాయకుడు అనుకున్నాము, కానీ అగ్రదేశాలకే నాయకుడు అయ్యారు’ అని చెప్తున్నారు. ఆ ఫోటో లో ఎంతవరకు నిజముందో కనుక్కుందాం.
క్లెయిమ్ : అగ్రదేశ నాయకులతో మోడీ కూడా ఉన్న ఫొటో.
ఫాక్ట్ (నిజం): జర్మనీలో జరిగిన G-20 సమ్మిట్-2017 సందర్భంగా తీసిన ఒక ఫోటోని ఎడిట్ చేసి అందులో మోడీని చేర్చారు. అది ఒక ఫోటోషాప్ చేయబడిన ఇమేజ్. కావున,పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అలాంటి ఫోటోనే ఒక వార్తా పత్రిక కథనం లో లభించింది. కానీ, అందులో మోడీ ఎక్కడా కూడా కనిపించలేదు. ఆ ఫోటో క్రింద ఫోటో క్రెడిట్స్ లో ‘AP Photo / Markus Schreiber’ అని ఉండడంతో ‘AP Photos’ వారి ఫోటో స్టాక్ లో వెతికినప్పుడు, అదే ఫోటో లభించింది. దానికి సంబంధించిన వివరణ చూసినప్పుడు, ఆ ఫొటోలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, యు.ఎస్. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుట్ కావుసోగ్లు మరియు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. కావున, మోడీ ఉన్నట్లుగా కనిపిస్తున్న ఆ ఫోటో ఒక ఫోటోషాప్ చేయబడిన ఫోటో.
మోడీ కూర్చున్న ఫోటో ఎక్కడిదో తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, దానిని 2016లో మోడీ ‘DigiDhan’ అనే ఈవెంట్ సందర్భంగా ఒక డిజిటల్ పేమెంట్ యాప్ ని విడుదల చేసినప్పుడు తీసినదిగా ‘Reuters’ వారు తీసిన ఫోటో యొక్క వివరణ ద్వారా తెలిసింది. ఈ ఫోటో యొక్క మిర్రర్ ఇమేజ్ ని పైన పేర్కొన్న G-20 సమ్మిట్-2017 సందర్భంగా తీసిన ఫోటోలో ఫోటోషాప్ పద్ధతి ద్వారా చేర్చినట్లుగా గమనించవచ్చు.
చివరగా, అగ్రదేశ నాయకులతో మోడీ ఉన్నట్లుగా కనిపిస్తున్న ఆ ఫోటో ఒక ఫోటోషాప్ చేయబడిన ఇమేజ్.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?