ఢిల్లీ లో జరుగుతున్న మత ఘర్షణల సమయంలో జస్టిస్ మురళీధర్ గారిని ట్రాన్సఫర్ చేయడం కొంత వివాస్పదంగా మారింది. తన ట్రాన్సఫర్ కి సంబంధించి Factly వివరంగా రాసిన ఆర్టికల్ ఇక్కడ చదవొచ్చు. అయితే, జస్టిస్ మురళీధర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నామినేషన్ వేసే సమయంలో ఆమెకి అడ్వకేట్ గా ఉండి నామినేషన్ వేయించారని చెప్తూ ఒక ఫోటోని ప్రచారం చేస్తున్నారు. అస్సలు ఆ ఫోటోలో ఉన్నది ఎవరో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: సోనియా గాంధీ నామినేషన్ సమయంలో ఆమెకి అడ్వకేట్ గా వ్యవహరించిన జస్టిస్ మురళీధర్.
ఫాక్ట్ (నిజం): పోస్టులోని ఫోటో సోనియా గాంధీ 2019 లోక్‌సభ ఎన్నికలకు రాయ్ బరేలీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసినప్పటిది. అందులో తనతో ఉన్నది లాయర్ కేసీ కౌషిక్, జస్టిస్ మురళీధర్ కాదు. కావున పోస్టులో చెప్పింది తప్పు.
పోస్టులోని సోనియా గాంధీ ఫోటో ఎప్పటిదా అని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, అది తను 2019 లోక్‌సభ ఎన్నికలకు రాయ్ బరేలీ నియోజకవర్గంలో 11 April 2019న నామినేషన్ దాఖలు చేసినప్పటిది అని చాలా సెర్చ్ రిజల్ట్స్ ద్వారా తెలుస్తుంది. దీనికి సంభవించిన సమాచారం ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. సోనియా గాంధీ నామినేషన్ ఫోటోని ఈనాడు మరియు స్టూడియోన్యూస్18 వెబ్సైటులో కూడా చూడవొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇదే ఫోటో తమ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో కూడా పోస్ట్ చేసింది.
ఫొటోలో సోనియా గాంధీతో ఉన్న లాయర్ ఎవరా అని వెతికితే తను లాయర్ కేసీ కౌషిక్ అని తెలిసింది. తన గురించి మరిన్ని వివరాల కోసం వెతకగా, 2012లో లాయర్ డే వేడుకలలో అప్పటి సుప్రీమ్ కోర్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిహెచ్ పారేఖ్ మరియు సెక్రెటరీగా ఉన్న కేసీ కౌషిక్ కి జరిగిన వివాదం గురించి తెలిసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ చదవొచ్చు.
2019లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేసిన సమయంలో తన పౌరసత్వం గురించి సందేహాలు వ్యక్తం అయ్యినప్పుడు పలు మీడియా సంస్థలు కేసీ కౌషిక్ ను రాహుల్ గాంధీ న్యాయవాదిగా సంబోధిస్తూ, తను ఇచ్చిన వివరణను ప్రచురించాయి. ఈ విషయం పై 10టీవీ ప్రచురించిన కథనాన్ని ఇక్కడ చదువొచ్చు. TimesNow ప్రచునించిన కథనంలోని వీడియోలో కూడా కేసీ కౌషిక్ ను చూడవొచ్చు.
సోనియా గాంధీ 2019 లోక్‌సభ ఎన్నికలకు రాయ్ బరేలీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన సమయంలో జస్టిస్ మురళీధర్ ఢిల్లీ హైకోర్టు లో న్యాయమూర్తిగా ఉన్నారు. చివరగా, సోనియా గాంధీ నామినేషన్ సమయంలో ఉన్న లాయర్ కేసీ కౌషిక్ ఫోటోని జడ్జి మురళీధర్ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?