Fake News, Telugu
 

ఒక మహిళ తన కూతురిని వేధిస్తున్న ఈ ఘటన నికరాగ్వా దేశంలో చోటు చేసుకుంది

0

ఒక అమ్మాయి చిన్న పాపను కింద పడేసి షూతో తొక్కుతూ వేధిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ ఘటన మన దేశంలో జరిగిందనుకొని వీడియోను పోలీసులకు చేరేలా షేర్ చేయాలని కూడా చెప్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఒక అమ్మాయి చిన్న పాపను కింద పడేసి షూతో తొక్కుతూ వేధిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ ఘటన నికరాగ్వా దేశంలోని కొండేగా అనే పట్టణంలో చోటుచేసుకుంది. వీడియోలో చిన్న పాపను వేధిస్తున్న మహిళను ఉవాల్‌డ్రినా సైల్స్‌గా గుర్తించారు. వీడియో వైరల్ అవడంతో పపోలీసులు ఆమెను అరెస్ట్ చేసారు. ఈ మహిళ డ్రగ్స్ కు బానిస అని వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. కాగా ఈ ఘటనకు మన దేశంతో ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఒక అమ్మాయి తన కూతురిని వేధిస్తున్న ఈ దృశ్యాలు నిజమే అయినప్పటికీ, ఈ ఘటనకు మన దేశంలో జరిగింది కాదు. సెంట్రల్ అమెరికాలోని నికరాగ్వా దేశంలో ఈ ఘటన రిపోర్ట్ అయింది.

ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసమం వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియోను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనాల ప్రకారం నికరాగ్వాలోని కొండేగా అనే పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వీడియోలో పాపను వేధిస్తూ కనిపిస్తున్న మహిళను ఉవాల్‌డ్రినా సైల్స్‌గా గుర్తించారు. కాగా వీడియోలో కనిపిస్తున్న చిన్న పాప ఆమె కూతురే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నికరాగ్వా పోలీసులు ఆ మహిళను అరెస్ట్ కూడా చేసారు. ఐతే ఆ మహిళ డ్రగ్స్ బానిస అని వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి.

ఈ ఘటన నికరాగ్వాలోని జరిగినట్టు రిపోర్ట్ చేసిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే ఈ ఘటన మన దేశంలో జరిగింది అనుకొని కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. కాని పైన తెలిపిన ఆదారాల బట్టి ఈ వీడియోకు మన దేశంతో సంబంధం లేదని స్పష్టముతుంది. 

చివరగా, ఒక మహిళ తన కూతురిని వేధిస్తున్న ఈ ఘటన నికరాగ్వాలో చోటు చేసుకుంది.

Share.

About Author

Comments are closed.

scroll