Update (23 November 2023):
తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ‘మన తెలంగాణ’ వార్తా పత్రిక ప్రచురించిన కథనమంటూ సోషల్ మీడియాలో మరొక ఫోటో షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం.
పోస్టులో షేర్ చేసిన వార్తా కథనమేది ‘మన తెలంగాణ’ వార్తా పత్రిక ప్రచురించలేదని తెలిసింది. అయితే వైరల్ పేపర్ క్లిప్పింగ్‌లో పైభాగంలో కనిపిస్తున్న వార్తా కథనం చివరి లైన్ ఆధారంగా, ‘మన తెలంగాణ’ ఈ-పేపర్లో వేతకగా, ఆ వార్తా ‘మన తెలంగాణ’ వార్తా పత్రిక 10 నవంబర్ 2023 ఎడిషన్‌లోని 7వ పేజీలో వచ్చినట్లు గుర్తించాము. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని బీఆర్ఎస్ నాయకుడు మరియు శేరిలింగంపల్లి ప్రస్తుత ఎంఎల్ఏ ఆరేకపూడి గాంధీ పేర్కొన్నట్టూ ఈ వార్తా కథనం రిపోర్ట్ చేసింది. ఈ వార్తా కథనం కింది భాగంలో, “పొరపాటున కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే కరెంట్ కష్టాలు తప్పవు” అనే హెడ్‌లైన్‌తో సబితా ఇంద్రారెడ్డి ఫోటోని షేర్ చేస్తూ ప్రచురించిన కథనం ఉంది. తెలంగాణను ఏపీలో కలిపేందుకు రేవంత్ రెడ్డి చంద్రబాబుతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ‘మన తెలంగాణ’ వార్తా సంస్థ 10 నవంబర్ 2023 ఎడిషన్‌లోని ఎక్కడ రిపోర్ట్ చేయలేదు.
Published (16 November 2023):
చంద్రబాబుతో రేవంత్ రెడ్డి అర్ధరాత్రి సమావేశమై తెలంగాణ విలీన ప్రతిపాదనపై చర్చలు జరిపినట్టు ‘దిశ’ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన వార్తా కథనమంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా షేర్ అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చంద్రబాబు రేవంత్ రెడ్డికి కొన్ని సూచనలు చేశారని, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేయాలని చంద్రబాబు రేవంత్ రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఈ వార్తా కథనం రిపోర్ట్ చేసింది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: చంద్రబాబు, రేవంత్ రెడ్డిల అర్ధరాత్రి భేటీపై ‘దిశ’ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన వార్తా కథనం స్క్రీన్ షాట్.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన కథనాన్ని ‘దిశ’ వార్తా పత్రిక ప్రచురించలేదు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఈ కథనాన్ని తాము ప్రచురించలేదని, తమ పత్రిక పేరుని వాడుకొని ప్రజలను గందరగోళ పరిచే ఉద్దేశంతో మార్ఫింగ్ చేయబడిన ఈ ఫేక్ వార్తా క్లిప్పింగ్‌ను కొన్ని రాజకీయ శక్తులు షేర్ చేస్తున్నాయని ‘దిశ’ వార్తా సంస్థ స్పష్టం చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వార్తా కథనాన్ని ‘దిశ’ వార్తా పత్రిక పబ్లిష్ చేసిందా అని వెతికితే, ‘దిశ’ పత్రిక అటువంటి వార్త ఏదీ తమ పత్రికలో ప్రచురించలేదని తెలిసింది. అయితే వైరల్ పేపర్ క్లిప్పింగ్‌లో పైభాగంలో ఉన్న రెండు లైన్‌లను ఆధారంగా, ‘దిశ’ ఈ-పేపర్లో వేతకగా, ఆ వార్తా ‘దిశ’ వార్తా పత్రిక 15 నవంబర్ 2023 ఎడిషన్‌లోని 3వ పేజీలో వచ్చినట్లు గుర్తించాము. ఆ రెండు లైన్లు “కేసిఆర్.. పరేషాన్” అనే హెడ్‌లైన్‌తో ప్రచురించిన కథనానికి సంబంధించినవి. ఈ వార్తా కథనం కింది భాగంలో “బీజేపీ, కాంగ్రెస్ ఒకటే” అనే హెడ్‌లైన్‌తో ప్రచురించిన కథనం ఉంది. చంద్రబాబు, రేవంత్ రెడ్డిల అర్ధరాత్రి భేటీపై ‘దిశ’ ధీనపత్రిక 15 నవంబర్ 2023 నాటి ఎడిషన్‌లో ఎక్కడ రిపోర్ట్ చేయలేదు.
సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఈ కథనాన్ని తాము ప్రచురించలేదని ‘దిశ’ వార్తా సంస్థ స్పష్టం చేసింది. తమ పత్రిక పేరుని వాడుకొని ప్రజలను గందరగోళ పరిచే ఉద్దేశంతో మార్ఫింగ్ చేయబడిన ఈ ఫేక్ వార్తా క్లిప్పింగ్‌ను కొన్ని రాజకీయ శక్తులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయని ‘దిశ’ వార్తా సంస్థ ఆరోపణ చేసింది. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసినది మార్ఫింగ్ చేయబడిన ఒక ఫేక్ వార్తా క్లిప్పింగ్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, చంద్రబాబు, రేవంత్ రెడ్డిల అర్ధరాత్రి భేటీపై ‘దిశ’ కథనం అని షేర్ చేస్తున్న ఈ క్లిప్పింగ్ ఫేక్, ఇది మార్ఫ్ చేయబడినది.