Fake News, Telugu
 

హిందూ ధర్మానికి సంబంధించి రజనీష్ మరియు అతని శిష్యుడికి మధ్య జరిగినట్టు చెప్తున్న ఈ సంభాషణ కల్పితమైనది

0

హిందూ సనాతన ధార్మిక వ్యవస్థ ప్రయోజనాలు మరియు ముస్లింల దాడి నుండి హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న విషయానికి సంబంధించి ఆచార్య రజనీష్ (ఓషో) మరియు అతని శిష్యుడి మధ్య జరిగిన సంభాషణ అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ సంభాషణలో హిందువులు మౌనంగా ఉండకుండా, శాస్త్ర సాంకేతికత సహాయంతో ధర్మాన్ని కాపాడుకోవాలని ఆచార్య రజనీష్ తన శిష్యుడికి చెప్తాడు. ఈ సంభాషణ ఆధారంగా ఏకరీతి పౌర స్మృతి, జనాభా నియంత్రణ మొదలైన చట్టాలు అమలు చేయాలని కూడా ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: హిందూ సనాతన ధర్మం మరియు ముస్లింల దాడి నుండి హిందూ దేవాలయాలను కాపాడడం గురించి ఆచార్య రజనీష్ మరియు తన శిష్యుడికి మధ్య జరిగిన సంభాషణ.

ఫాక్ట్(నిజం): రజనీష్‌కు మరియు అతని శిష్యుడికి మధ్య హిందూ సనాతన ధర్మం మరియు ముస్లింల దాడి నుండి హిందూ దేవాలయాలను  కాపాడడం గురించి ఇలాంటి సంభాషణ జరిగినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. పైగా పోస్టులో రజనీష్‌కు ఆపాదిస్తూ చేస్తున్న వాదనలకు పూర్తి వ్యతిరేకంగా అతని ప్రబోధనలు ఉన్నాయి. ఇవన్ని వైరల్ పోస్టులో చెప్తున్నది పూర్తి కల్పితమని స్పష్టమవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

హిందూ సనాతన ధార్మిక వ్యవస్థ ప్రయోజనాలు మరియు ముస్లింల దాడి నుండి హిందూ దేవాలయాలను/ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న విషయానికి సంబంధించి ఆచార్య రజనీష్ మరియు అతని శిష్యుడి మధ్య జరిగినట్టు ఈ వైరల్ పోస్టులో చెప్తున్న ఈ సంభాషణకు సంబంధించి ఎటువంటి ఆధారాలు మాకు లభించలేదు.

ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ఓషో పుస్తకాలలో గానీ, లేక వీడియోలలో ఎక్కడ కూడా ఓషో ఈ వ్యాఖ్యలు చేసినట్టు మాకు సమాచారం లభించలేదు.

పోస్టులో షేర్ చేసిన సంభాషణలో రజనీష్ హిందూ ఇతిహాసాల ద్వారా హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాడు. కాని నిజానికి అనేక సందర్భాలలో హిందూ మతంతో పాటు అన్నీ మతాలను విమర్శించాడు. కేవలం మత వ్యవస్థలనే కాకుండా దేవుడి ఉనికి మరియు నమ్మకాలను కూడా ఓషో విమర్శించాడు (ఇక్కడ, ఇక్కడ , ఇక్కడ మరియు ఇక్కడ).

హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి హిందువులు మౌనాన్ని వీడి సాంకేతికతను వాడాలని రజనీష్ చెప్పినట్టు ఈ వైరల్ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు, కాని నిజానికి రజనీష్  ధ్యానానికి చాలా ప్రాదాన్యతను ఇచ్చాడు (ఇక్కడ). సాంకేతికతపై అధికంగా ఆధారపడటం కన్నా ధ్యానాన్ని అభ్యసించడాన్ని అతను తనను అనుసరించే వాళ్ళకి ప్రచారం చేసాడు. పోస్టులో రజనీష్‌కు ఆపాదిస్తూ చేస్తున్న వాదనలకు పూర్తి వ్యతిరేకంగా అతని ప్రబోధనలు ఉన్నాయి. కాబట్టి ఈ పోస్టులో చెప్తున్నది పూర్తి కల్పితమని స్పష్టమవుతుంది.

చివరగా, హిందూ సనాతన ధర్మానికి సంబంధించి రజనీష్ మరియు అతని శిష్యుడికి మధ్య జరిగినట్టు చెప్తున్న ఈ సంభాషణ కల్పితమైనది.

Share.

About Author

Comments are closed.

scroll