Fake News, Telugu
 

ఈ పోస్టులో GST వచ్చిన తర్వాత టాక్స్ పెరిగిన వస్తు సేవల గురించి కాకుండా కేవలం తగ్గిన వస్తు సేవల గురించే ప్రస్తావించారు

0

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని GST కౌన్సిల్ పలు వస్తు సేవలకు సంబంధించి GST రేట్లను సవరణలు చేసిన నేపథ్యంలో వస్తు సేవలపై మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఉన్న టాక్స్‌లను ప్రస్థుత జీఎస్‌టీ రేట్లతో పోల్చుతూ, వస్తు సేవలపై మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విధించిన టాక్స్‌ల కన్నా మోదీ ప్రభుత్వం హయాంలో జీఎస్‌టీ కింద విధించే టాక్స్‌లే తక్కువని చెప్తున్న సోషల్ మీడియా పోస్ట్ ఒకటి విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా పోస్టులో చేస్తున్న వాదనలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: వస్తు సేవలపై మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విధించిన టాక్స్‌ల కన్నా మోదీ ప్రభుత్వం హయాంలో GST కింద విధించే టాక్స్‌లే తక్కువ.

ఫాక్ట్ (నిజం):  GST పద్ధతి వచ్చిన తరవాత చాలా వరకు వస్తు సేవలపై పన్నులు తగ్గినప్పటికీ, కొన్ని వస్తుసేవలపై టాక్స్‌లు పెరిగాయి కూడా. ఉదాహారణకు ఇంతకుముందు 15% టాక్స్ ఉండే చాలావరకు సేవలకు ప్రస్తుతం GST కింద 18% టాక్స్ వసూలు చేస్తున్నారు. అదేవిధంగా గతంలో గోధుమ, బియ్యం, పిండిపై 2.5%, 2.75% & 3.5% టాక్స్ వసూలు చేసేవారు. కాని ఇటీవల GST రేట్లకు చేసిన సవరణ ద్వారా ఈ వస్తువులకు 5% టాక్స్ (ప్యాక్ చేసిన వాటికి) వసూలు చేస్తున్నారు.  వైరల్ అవుతున్న పోస్టులో కేవలం గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం GST రేట్లు తక్కువున్న వస్తు సేవల గురించి మాత్రమే ప్రస్తావించారు. అందువల్ల జీఎస్‌టీ వచ్చిన తరవాత అన్నీ వస్తుసేవలపై టాక్స్ తగ్గిందన్న వాదన కరెక్ట్ కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వైరల్ పోస్టులో వివిధ వస్తు సేవలకు సంబంధించి పాత పన్ను రేట్లతో ప్రస్తుత GST రేట్లను పోల్చడం హేతుబద్ధమైనది కాదు. ఎందుకంటే గతంలో వస్తు సేవలపై దేశం మొత్తం ఒకే నిర్దిష్ట రేటు ఉండేది కాదు. ఒక్కో రాష్ట్రం ఒక్క విధంగా టాక్స్‌లు వేసేవి, దీనివల్ల వస్తు సేవలపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రేట్ ఉండేది. అలాంటప్పుడు గత టాక్స్ పద్ధతికి సంబంధించి వస్తు సేవలకు ఒక రేట్ ఆపాదించి, ఆ రేట్లను ప్రస్థుత GST రేట్లతో పోల్చడం కరెక్ట్ కాదు.

GST వచ్చిన తర్వాత పన్నులు తగ్గాయా?

గతంతో పోల్చుకుంటే GST పద్ధతి వచ్చిన తరవాత చాలా వరకు వస్తు సేవలపై పన్నులు తగ్గినప్పటికీ, కొన్ని వస్తు సేవలపై గతంలో కన్నా ప్రస్తుత GST పద్ధతిలోనే ఎక్కువ టాక్స్ వసూలు చేస్తున్నారు. ఉదాహారణకు ఇంతకుముందు 15% టాక్స్ ఉండే చాలావరకు సేవలకు ప్రస్తుతం GST కింద 18% టాక్స్ వసూలు చేస్తున్నారు.

అదేవిధంగా గతంలో గోధుమ, బియ్యం, పిండిపై 2.5%, 2.75% & 3.5% టాక్స్ వసూలు చేసేవారు. కాని ఇటీవల GST రేట్లకు చేసిన సవరణ ద్వారా ఈ వస్తువులకు 5% టాక్స్ వసూలు చేస్తున్నారు (ప్యాక్ చేసిన వాటికి).

ఐతే వైరల్ అవుతున్న పోస్టులో కేవలం గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం GST రేట్లు తక్కువున్న వస్తు సేవల గురించి మాత్రమే ప్రస్తావించారు. అందుకే GST వచ్చిన తరవాత అన్నీ వస్తు సేవలపై టాక్స్ తగ్గిందన్న వాదన కరెక్ట్ కాదు.

చివరగా, ఈ పోస్టులో GST వచ్చిన తర్వాత టాక్స్ పెరిగిన వస్తు సేవల గురించి కాకుండా కేవలం తగ్గిన వస్తుసేవల గురించే ప్రస్తావించారు.

Share.

About Author

Comments are closed.

scroll