Fake News, Telugu
 

యోగి ఆదిత్యనాథ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని ‘ABN ఆంధ్రజ్యోతి’ వార్తా సంస్థ రిపోర్ట్ చేసినట్టుగా షేర్ చేస్తున్న ఈ ఫోటో మార్ఫ్ చేయబడినది

0

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని, ఇటీవల ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని ‘ABN ఆంధ్రజ్యోతి’ వార్తా సంస్థ రిపోర్ట్ చేసిన బులెటిన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని ‘ABN ఆంధ్రజ్యోతి’ వార్తా సంస్థ రిపోర్ట్ చేసిన బులెటిన్ ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత  కొడాలి నాని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని ‘ABN ఆంధ్రజ్యోతి’ వార్తా సంస్థ రిపోర్ట్ చేసిన బులెటిన్ ఫోటోని ఎడిట్ చేసి ఈ ఫోటోని రూపొందించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో తెలుపుతున్నట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని ‘ABN ఆంధ్రజ్యోతి’ వార్తా సంస్థ రిపోర్ట్ చేసిందా అని వెతికితే, ‘ABN ఆంధ్రజ్యోతి’ అటువంటి వార్తా ఏది ఇటీవల రిపోర్ట్ చేయలేదని తెలిసింది. ఒకవేళ యోగి అదిత్యనాథ్‌కి క్యాన్సర్ ఉన్నట్టు తెలిస్తే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ అనేక వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసేయి. కానీ ఈ విషయాన్ని ఏ ఒక్క వార్తా సంస్థ ఇప్పటివరకు రిపోర్ట్ చేయలేదు.

అయితే, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు కొడాలి నాని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని ‘ABN ఆంధ్రజ్యోతి’ వార్తా సంస్థ ఇటీవల రిపోర్ట్ చేస్తూ ఒక వీడియో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వార్తా రిపోర్టు స్క్రీన్ షాట్‌ని పోస్టులో షేర్ చేసిన ఫోటోతో పోల్చి చూడగా, పోస్టులో షేర్ చేసిన ఫోటో కొడాలి నాని అనారోగ్యానికి సంబంధించి ‘ABN ఆంధ్రజ్యోతి’ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన రిపోర్టుని ఎడిట్ చేసి రూపొందించారని స్పష్టమయ్యింది. ఈ వార్తా రిపోర్టుని ‘ABN ఆంధ్రజ్యోతి’ ప్రస్తుతం తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ మరియు వెబ్సైట్ నుండి తొలగించింది.

సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని వదంతులను నమ్మి కొన్ని వార్తా సంస్థలు తన ఆరోగ్యానికి సంబంధించి తప్పుడు వార్తలు పబ్లిష్ చేశారని కోడాలి నాని ఇటీవల మీడియాకు స్పష్టం చేశారు. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, యోగి ఆదిత్యనాథ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని ‘ABN ఆంధ్రజ్యోతి’ వార్తా సంస్థ రిపోర్ట్ చేసినట్టుగా షేర్ చేస్తున్న ఈ ఫోటో మార్ఫ్ చేయబడినది.

Share.

About Author

Comments are closed.

scroll