Fake News, Telugu
 

ఫోటో లోని స్థంభాలు రామేశ్వరం గుడివి కావు, అవి ఫోటోషాప్ చేయబడినవి

1

తమిళనాడు లోని రామేశ్వరం గుడిలో 1212 స్తంభాలు అన్నీ చివరన ఒక చుక్కలాగా కలుస్తాయి అనే ఫోటో తో  ఒక పోస్ట్ సోషల్ మీడియా లో షేర్ కాబడుతోంది. ఈ పోస్ట్ లోని క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రామేశ్వరం గుడి లోని 1212 స్తంభాలు అన్నీ చివరన ఒక చుక్కలాగా కలుస్తాయి.

ఫాక్ట్ (నిజం): ఫొటోలో చూపించిన 1212 స్తంభాలు రామేశ్వరం గుడి లోనివి కావు. హోషంగ్ షా సమాధికి సంబంధించిన స్తంభాల ఫోటోని ఫోటోషాప్ చేసి ఆ స్తంభాలన్నీ చివరన ఒక చుక్కగా కలిసేటట్టు చేయబడింది. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

1212 స్థంభాలు ఉన్న రామేశ్వరం గుడి గురించి గూగుల్ లో వెతకగా,  రామేశ్వరంలో ఉన్న అరుళ్మిగు రామనాథ స్వామి గుడి గురించి తెలిసింది. ఆ గుడి యొక్క అధికారిక వెబ్సైటు చూస్తే అక్కడ ఉన్న మూడవ కారిడార్ లో 1212 స్థంభాలు ఉన్నాయి అని తెలుస్తుంది.

గుడిలో ఉన్న స్థంభాలని, పోస్టు లోని ఫోటోలో ఉన్న స్తంభాలతో పోల్చుకుంటే, వాటిని చెక్కిన విధానం మరియు స్థంభాలన్ని ఒక గట్టు మీద ఉండడం వంటి తేడాలు చూడవచ్చు.

అంతేకాక, పోస్ట్ లోని ఫోటో ఫోటోషాప్ చేయబడినట్టుగా తెలుస్తుంది, ఎందుకంటే ఎడమ వైపు ఉన్న స్థంభాలన్నిటిలో ఒకటే చీలిక కనిపిస్తుంది.

‘SM Hoax Slayer’ 2017లో ప్రచురించిన ఒక ఆర్టికల్  ప్రకారం, హోషంగ్ షా సమాధికి సంబంధించిన స్తంభాలను ఫోటోషాప్ చేసి ఫోటో లో వాడారని తెలుస్తుంది. గూగుల్ లో కూడా హోషంగ్ షా సమాధికి సంబంధించిన స్తంభాల గురించి వెతకగా ఇలాంటి ఫొటోలే లభించాయి. హోషంగ్  షా సమాధిలో 81 స్తంభాలు మాత్రమే ఉన్నాయి. Getty Images లో కూడా హోషంగ్ షా సమాధికి సంబంధించిన ఫోటోలని చూడవచ్చు.

చివరగా, హోషంగ్ షా సమాధికి సంబంధించిన స్తంభాలను ఫోటోషాప్ చేసి రామేశ్వరం గుడిలోని 1212 స్థంబాలు అని షేర్ చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll