ఫేస్బుక్ లో కొన్ని ఫోటోలను పోస్టు చేసి, అవి పిల్లల కిడ్నాప్ ఘటనలకు సంబంధించినవి అంటూ ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో పరిశీలిద్దాం.
క్లెయిమ్: ‘పిల్లల కిడ్నాప్’ ఘటనలకు సంబంధించిన ఫోటోలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో ఉన్న చాలా వారకు ఫోటోలు ‘పిల్లల కిడ్నాప్’ ఘటనలకి సంబంధించినవి కావు. కావున ఆరోపణ తప్పు.
ఫోటో-1:
ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది ‘Jio bihar’ అనే ఒక యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోలో లభించింది. ఆ వీడియో లో 9:44 నిడివి దగ్గర పోస్టులో ఉన్న ఫ్రేమ్ ని చూడవచ్చు. దానిని పూర్తిగా చూసినట్లయితే ‘పిల్లల కిడ్నాప్’ ఆధారంగా కామెడీ కోసం చిత్రీకరించినట్లుగా తెలుస్తుంది. ఆ యూట్యూబ్ ఛానల్ లో అలాంటివి ఇంకా చాలా వీడియోలోను కూడా చూడవచ్చు. కావున, ఆ ఫోటో వాస్తవ ఘటనకి సంబంధించినది కాదు.
ఫోటో 2 & 3:
గత నెలలో ఇవే ఫోటోలు ‘పిల్లల కిడ్నాప్’ ఘటనకి సంబంధించినవి అంటూ వ్యాప్తి చెందినప్పుడు, ‘FACTLY’ వారు ఆ ఆరోపణ తప్పు అంటూ రాసిన కథనం ఇక్కడ చదవవచ్చు. కావున, ఆ ఫోటోలు ‘పిల్లల కిడ్నాప్’ ఘటనకి సంబంధించినవి కావు.
ఫోటో-4:
పిల్లల అపహరణ ఘటనకి సంబంధించినవనే ఆరోపణతో ఈ ఫోటో మరియు పైన ఉన్న ఫోటో-3 వ్యాప్తి చెందినప్పుడు, అది తప్పు అంటూ ఇతర ఫాక్ట్ చెక్కర్ ‘BOOM’ రాసిన కథనం ద్వారా తెలుసుకోవచ్చు. కావున, ఆ ఫోటో కూడా ‘పిల్లల కిడ్నాప్’ ఘటనకి సంబంధించినది కాదు.
పోస్టులో ఉన్న మరిన్ని ఫోటోల గురించి సమాచారం కోసం వెతికినప్పుడు, ఏ విశ్వసనీయ వార్తా సంస్థ ద్వారా కూడా వాటికి సంబంధించిన సమాచారం లభించలేదు.
చివరగా, పోస్టులో ఉన్న చాలా వారకు ఫోటోలు ‘పిల్లల కిడ్నాప్’ ఘటనలకి సంబంధించినవి కావు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?