Fake News, Telugu
 

‘ఒడిషా లో పట్టుబడ్డ కిడ్నాపర్లు’ అని చెప్తూ సంబంధం లేని ఫోటోలను షేర్ చేస్తున్నారు

0

బీహార్ నుంచి జార్ఖండ్ మధ్యలో బిచ్చగాళ్ళ వేషంలో 500 వందల మందికి పైగా బయలుదేరారని, మార్గమద్యంలో ఒంటరిగా దొరికినవారిని చంపి మెడికల్ కాలేజీలకు మరియు కిడ్నీ దందాలకు సరఫరా చేస్తున్నారని చెప్తూ కొన్ని ఫోటోలతో ఉన్న పోస్ట్ ని సోషల్ మీడియా లో కొందరు షేర్ చేస్తున్నారు. ఇవే ఫోటోలను పిల్లల కిడ్నాపింగ్ గ్యాంగ్ లకి సంబందించినవని ఇంకొంత మంది పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒరిస్సా కిడ్నాపులకి సంబంధించిన ఫోటోలు.       

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని రెండు ఫోటోలు హర్యానా లో జరిగిన ఒక సంఘటనకి సంబంధించినవి. కారు డిక్కీలో కూర్చున్న పిల్లలను చూసి, వారు కిడ్నాప్ అయ్యారని అనుకొని కొంత మంది ఒక కారుని ఆపారు. పోలీసులు వచ్చి కారు యజమానిని అడగగా, డిక్కీ లోని పిల్లలు తమ పిల్లలేనని, కారులో ప్లేస్ లేకపోవడంతో పిల్లలు డిక్కీలో కూర్చున్నారని తను తెలిపాడు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ లోని ఫోటోలను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఒక ఫోటో ‘Dainik Bhaskar’  ఆర్టికల్ లో దొరుకుతుంది. పోస్ట్ లో పిల్లలు డిక్కీ లో కూర్చొని ఉన్న ఫోటో హర్యానా లో తీసినట్టు ఆ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. వివరాల్లోకి వెలితే, ఒక కారు డిక్కీలో పిల్లలను చూసి, వారు కిడ్నాప్ అయ్యారనుకొని కొందరు ఆ కారుని ఆపారు. పోలీసులు వచ్చి ఆ కారు యజమానిని అడగగా, డిక్కీలోని పిల్లలు తమ పిల్లలేనని, కారు లో ప్లేస్ లేకపోవడంతో పిల్లలు డిక్కీలో కూర్చున్నారని తెలిపాడు. గాలి రావడం కోసం డిక్కీ తెరిచిపెట్టామని, పిల్లల భద్రతకోసం చున్ని కట్టామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటనకి సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ అయ్యింది. ఆ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

పోస్ట్ లోని రెండు ఫోటోలు ఈ ఘటనకి సంబంధించినవే. మిగితా రెండు ఫోటోలు ఇంటర్నెట్ లో ఎక్కడా కూడా దొరకలేదు. పోస్ట్ లో చెప్పిన విషయమే చెప్తూ జూన్ లో కూడా కొందరు కొన్ని వేరే ఫోటోలు షేర్ చేసారు. అప్పుడు కూడా అవి తప్పు అని చెప్తూ FACTLY రాసిన ఆర్టికల్ ని ఇక్కడ చదవచ్చు.

కావున, ‘ఒడిషా లో పట్టుబడ్డ కిడ్నాపర్లు’ అని చెప్తూ సంబంధం లేని ఫోటోలను షేర్ చేస్తున్నారు

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll