Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

మార్కెట్ లో సామాజిక దూరాన్ని పాటిస్తూ కూరగాయలు అమ్ముతున్న ఈ ఫోటోలు భారత్ లో తీసినవి కావు

0

మార్కెట్ లో సామాజిక దూరాన్ని పాటిస్తూ కూరగాయలు అమ్ముతున్న ఫోటో ను ఫేస్బుక్ లో పోస్టు చేసి, అది మణిపూర్ లోని ఒక మార్కెట్ లో తీసారని చెప్తున్నారు. అలాంటి ఫొటోనే (అర్చివ్ద్) మరి కొంతమంది పోస్టు చేసి, అది మిజోరాం లోని మార్కెట్ లో తీసారని పేర్కొంటున్నారు. వాటిల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: మణిపూర్ (ఇండియా) లోని మార్కెట్ లో సామాజిక దూరాన్ని పాటిస్తూ కూరగాయలు అమ్ముతున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఫోటో మణిపూర్ (ఇండియా) లో గానీ, మిజోరంలో (ఇండియా) గానీ తీసినది కాదు. దానిని మయాన్మార్ దేశంలోని షాన్ రాష్ట్రం లోని ‘కలావ్’ మార్కెట్ లో తీసారు. కావున, పోస్టు లో చెప్పింది తప్పు.

పోస్టు లోని ఫోటోని అదే క్లెయిమ్ తో ఒక యూజర్ ట్విట్టర్ లో పెట్టినప్పుడు, కామెంట్స్ లో మరొక యూజర్ ఆ ఫోటో మయాన్మార్ దేశంలోని షాన్ రాష్ట్రానికి సంబంధించిన ‘కలావ్’ మార్కెట్ లో తీసారని పేర్కొన్నాడు.

ఆ సమాచారంతో, గూగుల్ లో కీ-వర్డ్స్ తో వెతికినప్పుడు, ఆ ఫోటో మయాన్మార్ దేశంలో తీసిందంటూ ట్విట్టర్ లో కొంతమంది యుజర్లు మరియు కొన్ని న్యూస్ బ్లాగ్లు పేర్కొన్నట్లుగా తెలిసింది. ఫోటోని రెండు దేశాల్లో తమ దేశానికి సంబంధించినవిగా షేర్ చేస్తున్నారు కాబట్టి, వాటిని ఎక్కడ తీసారో నిర్ధారించడానికి కొన్ని ఆధారాల కోసం చూద్దాం.

ఆధారం-1:

‘కలావ్’ మార్కెట్ ఫోటోల కోసం గూగుల్ లో వెతికినప్పుడు, పోస్టులో ఉన్న ఫోటోలోని పరిసరాలతో ఉన్న మరొక ఫోటో లభించింది.

ఆధారం -2:

ఫోటోలోని హోర్డింగ్‌ పై ‘High Class’ బ్రాండ్‌ తో ఉన్న ప్రకటన చూడవచ్చు. ఆ సమాచారంతో గూగుల్ లో కీ-వర్డ్స్ తో వెతికినప్పుడు, అది ‘Seagram’s High Class – Myanmar’ ప్రకటన అని తెలిసింది. ‘Seagram’s High Class’ విస్కీ ని మయాన్మార్ లో అక్టోబర్ 2018 లో లాంచ్ చేసారు.

అంతేకాదు, వివిధ సమయాల్లో  అనేక ప్రకటనలతో ఉన్న అదే హోర్డింగ్‌ యొక్క మరికొన్ని ఫోటోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. (ఆ ఫోటోల లొకేషన్ కూడా మయాన్మార్ లోని ‘కలావ్’ మార్కెట్ అని ఉంది).  

ఆధారం -3:

అదే మార్కెట్ యొక్క మరికొన్ని తాజా ఫోటోలు ట్విట్టర్‌లో లభించాయి. ఆ ఫోటోలలో కూరగాయలు అమ్ముతున్న వారు ‘mytel’ అనే పేరుతో ఉన్న గొడుగు కింద కూర్చుని ఉన్నారు. ‘mytel’ అనేది మయన్మార్‌లోని మొబైల్ నెట్‌వర్క్ సంస్థ.

చివరగా, పైన పేర్కొన్న ఆధారాలతో, మార్కెట్ లో సామాజిక దూరాన్ని పాటిస్తూ కూరగాయలు అమ్ముతున్న ఈ  ఫోటోలు మయాన్మార్ దేశంలోని షాన్ రాష్ట్రం లోని ‘కలావ్’ మార్కెట్ లో తీసినట్టు నిర్దారించొచ్చు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll