Fake News, Telugu
 

ఎర్రబెల్లి, కేసీఆర్ కి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో చేరక ముందు చేసినవి

1

ఆర్టీసీ సమ్మె విషయంలో సొంత మంత్రి అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ని వ్యతిరేకిస్తున్నాడని చెప్తూ ఒక వీడియోని చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేసీఆర్ పై సొంత మంత్రే (ఎర్రబెల్లి దయాకర్ రావు) వ్యతిరేక గళం. 

ఫాక్ట్ (నిజం): 2015 లో టీఆర్ఎస్ పార్టీ లో చేరకముందు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడిన వీడియోని పెట్టి, తాజాగా ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ ని ఎర్రబెల్లి వ్యతిరేకిస్తున్నట్టుగా తప్పుదోవ పట్టిస్తున్నారు 

వీడియో లో V6 ఛానల్ తో ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతున్నట్టు చూడొచ్చు. కావున, యూట్యూబ్ లో ‘Dayakar V6’ అని సెర్చ్ చేయగా, పోస్ట్ లోని వీడియోతో ఉన్న ఒక V6 వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. V6 వారు యూట్యూబ్ లో పెట్టిన వీడియోని చూస్తే, పోస్ట్ లోని వీడియో 2015 లో తీసినట్టుగా తెలుస్తుంది. 2015 లో ఆర్టీసీ వాళ్ళ డిమాండ్ల గురించి ఎర్రబెల్లి మాట్లాడినదానికి, ఇప్పుడు మాట్లాడుతున్నదానికి తేడా చూపిస్తూ V6 వారు వీడియో పెట్టినట్టు చూడవొచ్చు.

ఎర్రబెల్లి దయాకర్ రావు 2016 లో టీఆర్ఎస్ పార్టీ లో చేరాడు. అంటే, తాను టీఆర్ఎస్ పార్టీ లో చేరక ముందు చేసిన వ్యాఖ్యల వీడియోని పెట్టి, ఇప్పుడు మంత్రిగా కేసీఆర్ ని వ్యతిరేకిస్తున్నాడని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

చివరగా, టీఆర్ఎస్ లో చేరక ముందు ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలను పెట్టి, ఇప్పుడు కేసీఆర్ కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll