Fake News, Telugu
 

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పిల్లలని ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలన్న వార్తలో నిజం లేదు.

0

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పిల్లలని ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వై.ఎస్.జగన్ ప్రకటించారు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పిల్లలని ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలి.

ఫాక్ట్(నిజం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్కూల్ ఎడ్యుకేషన్ అయిన బుడితి రాజశేఖర్ ఈ వార్త ఫేక్ అని నిర్ధారించారు. ఈ వార్తకి సంబంధించి ఎటువంటి వార్తా కథనాలుగాని, ప్రభుత్వ సర్క్యులర్లు గాని మాకు కనిపించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వార్తకి సంబంధించిన మరింత సమాచారం కొరకు వెతకగా, మాకు ఈ వార్తకి సంబంధించి ఎటువంటి వార్తా కథనాలుగాని, ప్రభుత్వ సర్క్యులర్లు గాని కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్కూల్ ఎడ్యుకేషన్ అయిన బుడితి రాజశేఖర్ ని ఈ వార్త గురించి వివరణ కోసం సంప్రదించగా, ఆయన ఈ వార్త ఫేక్ అని నిర్ధారించారు.

చివరగా, ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పిల్లలని ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలన్న వార్తలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll