Fake News, Telugu
 

ఈ కొటేషన్లు రోమన్ సామ్రాజ్యపు తత్వవేత్త ‘మార్కస్ సిసెరో’ చెప్పారనడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

రోమన్ సామ్రాజ్యపు తత్వవేత్త ‘మార్కస్ సిస్రో’ చెప్పిన కొటేషన్లు అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రోమన్ సామ్రాజ్యపు తత్వవేత్త ‘మార్కస్ సిసెరో’ చెప్పిన కొటేషన్లు.

ఫాక్ట్: ఈ కొటేషన్లు రోమన్ సామ్రాజ్యపు తత్వవేత్త ‘మార్కస్ సిసెరో’ చెప్పారనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇంతకముందు ఇదే వార్త వైరల్ అయినప్పుడు, ఆస్ట్రేలియన్ అసోసియేటెడ్ ప్రెస్ వారు ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్ రాసారు. మార్కస్ సిసెరోకు సంబంధించి ఇద్దరు నిపుణులను వారు అడిగినప్పుడు, ఆ పదాలు సిసెరోకు చెందినవి కావు అని వారు చెప్పారు. మార్కస్ తుల్లియస్ సిసెరో క్రీ.పూ 106లో జన్మించాడు, రోమన్ సెనేట్ లో సభ్యుడిగా ఎదిగాడు. అతను పబ్లిక్ స్పీకర్ గా, రాజకీయ వేత్తగా మరియు తత్వవేత్తగా ప్రసిద్ధి చెందాడు. అతను క్రీ.పూ 43 లో హత్య చేయబడ్డాడు. సిసెరో లిఖితపూర్వఖంగా తన ఆలోచనలను వ్యక్తం చేసేవాడు, ఇటువంటి కొటేషన్లు గనక ఆయన చెప్పుంటే ఆయన రచనల్లో కచ్చితంగా లభించి వుండేవి. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

సిసెరోకు ఆపాదించబడిన కోట్స్ విభిన్న రూపాల్లో అనేక సంవత్సరాలుగా ఇంటర్నెట్‌లో షేర్ అవుతున్నాయి. ఆగస్టు 2012 నుండి, తొమ్మిదికి బదులుగా 11 కొటేషన్స్ కలిగి ఉన్న పోస్ట్ షేర్ చేసేవారు. ఇది ఆక్యుపై వాల్ స్ట్రీట్ ఉద్యమానికి సంబంధించిన ఒక సైట్ లో మొదలయింది. అందులోని ఒక సభ్యుడు “బెంజమిన్” ఈ కొటేషన్లు సిసెరోకు ఆపాదిస్తూ పోస్ట్ చేసాడు, అతను వీటి సోర్స్ గురించి ఎటువంటి సమాచారాన్ని అందించలేదు.

ఇంతకముందు ఇదే వైరల్ అయినప్పుడు ఆస్ట్రేలియన్ అసోసియేటెడ్ ప్రెస్ ఫ్యాక్ట్ చెక్, ఇటువంటి పోస్టుకు సంబంధించి ఆర్టికల్ రాసారు. మార్కస్ సిసెరోకు సంబంధించి ఇద్దరు నిపుణులను వారు అడిగి తెలుసుకున్నారు. సీన్ మెక్ కోనెల్ (‘Philosophical Life in Cicero’s Letters’ బుక్ రచయిత), ఒటాగో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జోన్ హాల్ (‘Politeness and Politics in Cicero’s Letters’ బుక్ రచయిత, ఈ ఇద్దరూ ఆ పదాలు సిసెరోకు చెందినవి కావు అని చెప్పారని ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.

మార్కస్ తుల్లియస్ సిసెరో క్రీ.పూ 106లో జన్మించాడు. రోమన్ సెనేట్ లో సభ్యుడిగా ఎదిగాడు. అతను పబ్లిక్ స్పీకర్ గా, రాజకీయ వేత్తగా, తత్వవేత్తగా ప్రసిద్ధి చెందినవాడు. అతను క్రీ.పూ 43 లో హత్య చేయబడ్డాడు. అయితే న్యాయవాదిగా, సెనేటర్ గా అతని ఆలోచనలు, రచనలు, ప్రసంగాల రూపంలో ఉన్నాయి. సిసెరో లిఖితపూర్వఖంగా తన ఆలోచనలను వ్యక్తం చేసాడు. ఆన్‌లైన్‌లో అనేక మార్కస్ సిసెరో కొటేషన్లు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. పోస్టులో చేసిన కొటేషన్లు ఇందులో కూడా లేవు.

చివరగా, ఈ కొటేషన్లు రోమన్ సామ్రాజ్యపు తత్వవేత్త ‘మార్కస్ సిసెరో’ చెప్పారనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll