Fake News, Telugu
 

కామెడీ స్కిట్‌ వీడియోని పెళ్లిలో గుట్కా నములుతున్న వరుడిని పెళ్ళికూతురు చితకబాదుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

తాళి కట్టే సమయంలో పెళ్ళికూతురు వరుడిని చితకబాదుతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. వరుడు పెళ్లిలో గుట్కా నములుతున్నాడనే కారణంతో పెళ్లి కూతురు అతన్ని ఇలా కొట్టినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ‘HMTV’ న్యూస్ ఛానల్ వారు ఈ వీడియోని ఇదే క్లెయింతో తమ సోషల్ మీడియా హండిల్స్‌లో షేర్ చేసారు. ఆ పోస్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పెళ్లిలో గుట్కా నములుతున్న వరుడిని పెళ్లి కూతురు కొడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, ఒక పాత కామెడీ స్కిట్‌కు సంబంధించిన దృశ్యాలని చూపిస్తుంది. ఈ వీడియోలో వరుడిగా కనిపిస్తున్నది రాంలాల్ అనే హాస్య కళాకారుడు. ఈ వీడియోలో కనిపిస్తున్నది నిజమైన పెళ్లి కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని చందన్ మిశ్రా పేరుతో ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ 04 ఏప్రిల్ 2020 నాడు షేర్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో కనిపిస్తున్నవి ఒక కామెడీ స్కిట్ దృశ్యాలని వివరణలో స్పష్టంగా తెలిపారు. రాంలాల్ మైథిలి కామెడీ క్లబ్ వారు ఈ స్కిట్‌ను రూపొందించినట్టు ఈ వీడియోలో తెలిపారు. పోస్టులో షేర్ చేసిన వీడియోలోని అవే దృశ్యాలు ఈ వీడియోలోని 7:16 నిమిషాల నుండి చూడవచ్చు.

ఈ వీడియోలో వరుడిగా కూర్చున్న వ్యక్తి రాంలాల్ అనే హాస్య కళాకారుడు అని తెలిసింది. రాంలాల్ చేసిన మరికొన్ని కామెడీ స్కిట్లని రాంలాల్ మైథిలి కామెడీ క్లబ్ ఫేస్బుక్ పేజిలో చూడవచ్చు. ఈ కామెడీ స్కిట్లు బీహార్ రాష్ట్రంలో వాడుకలో ఉండే మైథిలి భాషలో రూపొందించినట్టు తెలిసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో ఒక కామెడీ స్కిట్‌కు సంబంధించిన దృశ్యాలని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఈ వీడియోని పోస్టులో చేస్తున్న అదే క్లెయింతో కొన్ని జాతీయ న్యూస్ సంస్థలు కూడా ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఆ అర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, పెళ్లికూతురు వరుడిని కొడుతున్నట్టుగా షేర్ చేస్తున్న ఈ వీడియో ఒక కామెడీ స్కిట్‌కు సంబంధించింది.

Share.

About Author

Comments are closed.

scroll