Fake News, Telugu
 

బైబిల్‌ని కాలిఫోర్నియాలో నిషేధించారనడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

కాలిఫోర్నియాలో బైబిల్ నిషేధించారంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. బైబిల్‌లో ‘sexual topics’ ఎక్కువగా ఉన్నాయని, చిన్న పిల్లలు చదవటం మంచిదికాదని బైబిల్‌ని నిషేధించిన కాలిఫోర్నియా ప్రభుత్వం అంటూ పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బైబిల్‌ని కాలిఫోర్నియాలో బ్యాన్ చేసారు.

ఫాక్ట్: కాలిఫోర్నియాలో బైబిల్‌ని నిషేధించారా అనే విషయం గురించి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ 2018లో ప్రవేశపెట్టిన బిల్లు 2943 గురించి సభ్యుడు ట్రావిస్ అలెన్ ను అడిగినప్పుడు ‘ఈ ప్రతిపాదిత చట్టం (బైబిల్ అమ్మకాన్ని) నిషేధిస్తో౦ది.’ అని అన్నారు. డెమొక్రాట్ కాలిఫోర్నియా లా మేకర్ ‘ఇవాన్ లో’ ప్రవేశపెట్టిన ఈ బిల్లు, స్వలింగ మార్పిడి చికిత్సను వ్యాపారంగా మార్చడాన్ని చట్టవిరుద్ధం చేస్తుందని, ఇది బైబిల్ను నిషేధించదని ఆయనే చెప్పారు. అయినా, ‘ఇవాన్ లో’ సెప్టెంబర్ 2018లో ఈ బిల్లును ఉపసంహరించుకున్నాడు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

కాలిఫోర్నియాలో బైబిల్‌ని నిషేధించారా అనే విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, అలా నిషేధించారని ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటిది జరిగుంటే, అన్నీ ప్రముఖ వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి.

ఏప్రిల్ 2018లో, వన్ అమెరికా న్యూస్ నెట్ వర్క్ (ఓఎఎన్) కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ సభ్యుడు ట్రావిస్ అలెన్ ను ఇంటర్వ్యూ చేసింది. అతన్ని కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ అప్పట్లో ప్రవేశపెట్టిన బిల్లు 2943 గురించి అడిగినప్పుడు ఇలా అన్నారు. ‘ఈ ప్రతిపాదిత చట్టం (బైబిల్ అమ్మకాన్ని) నిషేధిస్తో౦ది.’

డెమొక్రాట్ కాలిఫోర్నియా లా మేకర్ ‘ఇవాన్ లో’ ప్రవేశపెట్టిన ఈ బిల్లు, స్వలింగ మార్పిడి చికిత్సను వ్యాపారంగా మార్చడాన్ని చట్టవిరుద్ధం చేస్తుందని, ఇది బైబిల్ ను నిషేధించదని ట్విట్టర్ వేదికగా ఆయనే అన్నారు.

‘ఇవాన్ లో’ సెప్టెంబర్ 2018 లో ఈ బిల్లును ఉపసంహరించుకున్నాడు. ‘భవిష్యత్తు పట్ల ఆశాజనక దృష్టితో, అసెంబ్లీ మరియు సెనేట్లో బిల్లుకు మద్దతు లభించినప్పటికీ, ఈ ఏడాది నేను ఈ బిల్లును గవర్నర్ కు పంపబోను’ అని తన స్టేట్మెంట్ లో చెప్పాడు.

చివరగా, బైబిల్‌ని కాలిఫోర్నియాలో నిషేధించారనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll