Coronavirus Telugu, Fake News, Telugu
 

లాక్ డౌన్ టైమింగ్స్ లో ఆంధ్ర ప్రదేశ్ ఎటువంటి మార్పులు చేయలేదు

0

ఈ నెల 20వ తేదీ నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో లాక్ డౌన్ వేళల్లో మార్పులు చేసారని, ప్రస్తుతం ఉదయం 6 నుంచి 12 వరకు ఉన్న లాక్ డౌన్ ని సడలిస్తూ 20వ తేదీ నుంచి ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిందని, ఆంధ్ర ప్రదేశ్ లో కరోన కేసులతో పాటు మరణాల సంఖ్య దేశంలోనే 2 వ స్థానంలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూదాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: మే 20వ తేదీ నుండి లాక్ డౌన్ టైమింగ్స్ లో మార్పులు ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.

ఫాక్ట్: సోమవారం (17 మే 2021)  కోవిడ్ పై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాక్ డౌన్ టైమింగ్స్ లో మార్పులు లేకుండా లాక్ డౌన్ నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు న్యూస్ ఆర్టికల్స్ లో వచ్చింది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

ఆంధ్ర ప్రదేశ్ లో లాక్ డౌన్ కు సంబంధించి సమాచారం కోసం వెతికినప్పుడు కొన్ని న్యూస్ ఆర్టికల్స్ మాకు దొరికాయి. లాక్ డౌన్ సమయాల్లో ఎలాంటి మార్పు లేదని ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని న్యూస్ 18 ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. ఏపీలో లాక్‌డౌన్ టైమింగ్స్‌లో మార్పులు చేసినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఏపీ సర్కారు స్పష్టంచేసింది అని, లాక్‌డౌన్ సడలింపు వేళలు యధావిధిగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయని తేల్చిచెప్పింది అని, ప్రభుత్వ ప్రకటనలను తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సర్కారు హెచ్చరించింది అని జీ న్యూస్ ఆర్టికల్  లో తెలిపారు. ఏపీలో కరోనా కేసులతో పాటు కరోనాతో చనిపోతున్న వారి సంఖ్య దేశంలోనే 2వ స్థానంలో ఉన్నందు వల్లే లాక్‌డౌన్ టైమింగ్స్ (Lockdown timings) మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్వయంగా ప్రభుత్వమే చేసిన ప్రకటనతో స్పష్టత లభించింది అని కూడా ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.

లాక్ డౌన్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం (17 మే 2021)  కోవిడ్ పై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ ఆర్టికల్స్ ద్వారా ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారే, ఇలాంటి పోస్ట్ ల ద్వారా తప్పుడు ప్రచారం జరుగుతుంది అని తెలిసి ట్విట్టర్ పోస్ట్ ద్వారా తప్పని చెపుతూ లాక్ డౌన్ టైమింగ్స్ లో మార్పు లేదని తెలిపారు. ఏపి పోలీస్ వారు కూడా తమ ట్విట్టర్ పోస్ట్ ద్వారా లాక్ డౌన్ టైమింగ్స్ లో ఎటువంటి మార్పు లేదని ఫాక్ట్ చెక్ చేసారు. ఏపీలో కరోనా కేసులతో పాటు కరోనాతో చనిపోతున్న వారి సంఖ్య దేశంలోనే 2వ స్థానంలో ఉంది అనేది తప్పు అని ఏపీ ఫాక్ట్ చెక్ పోర్టల్ ట్విట్టర్ పోస్ట్ ద్వారా తెలిపింది. రాష్ట్రాల కోవిడ్ స్టేటస్ కు సంబంధించి డేటా ను ఇక్కడ చూడొచ్చు. పోస్ట్ లోని క్లెయిమ్ ని తప్పని తెలుపుతూ మీడియా సంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, లాక్ డౌన్ టైమింగ్స్ లో ఆంధ్ర ప్రదేశ్ ఎటువంటి మార్పులు చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll