Fake News, Telugu
 

‘మహిళ స్వరోజ్గార్ యోజన’ పేరుతో ఎటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం లేదు. ఖాతాలోకి లక్ష రూపాయలు రావు.

1

మహిళలకు బ్యాంకు ఖాతా ఉంటే, వ్యాపారం పెట్టుకోవడానికి వాళ్ళకి ఒక లక్ష రుపాయలను ‘మహిళ స్వరోజ్గార్ యోజన’ పథకం కింద మోడీ ప్రభుత్వం బ్యాంకు ఖాతాలో వేస్తుందని ఒక లింక్ తో కూడిన పోస్ట్ ని చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పోస్ట్ లో ఇచ్చిన లింక్ (ఆర్కైవ్డ్ వెర్షన్) లో ఆ పథకం గురించి వివరిస్తూ ఒక యూట్యూబ్ వీడియో ఉంటుంది. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బడ్జెట్-2019 లో ‘మహిళ స్వరోజ్గార్ యోజన’ పతాకాన్ని మొదలుపెట్టిన మోడీ ప్రభుత్వం. బ్యాంకు ఖాతా ఉన్న మహిళలకు వ్యాపారం పెట్టుకోవడానికి ఒక లక్ష రూపాయలు ఖాతాలో ప్రభుత్వం వేస్తుంది.

ఫాక్ట్ (నిజం): ‘మహిళ స్వరోజ్గార్ యోజన’ పేరుతో ఎటువంటి పథకాన్ని బడ్జెట్-2019 లో మోడీ ప్రభుత్వం ప్రకటించలేదు. అదే పేరుతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రజల కోసం ఒక పథకం ఉంది, కానీ ఆ పథకం కింద కేవలం అయిదు వేల రుపాయల వరకే మహిళలకు మరియు వికలాంగులకు వ్యాపారం పెట్టుకోవడానికి ఇస్తారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన పథకం గురించి గూగుల్ లో ‘Mahila Swarojgar Yojana’ పేరుతో వెతకగా, ఆ పథకం పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకం ఉన్నట్టు ఎటువంటి సమాచారం దొరకదు. పోస్ట్ చేసిన లింక్ లోని వీడియో లో ఆ పథకాన్ని మోడీ ప్రభుత్వం బడ్జెట్-2019 లో ప్రకటించినట్టు ఉంటుంది. కావున, ఆ పథకం గురించి  బడ్జెట్-2019 లో వెతకగా, దాంట్లో కూడా ఆ పేరుతో ఎటువంటి పథకం ఉండదు. కేంద్ర ఆర్ధిక మంత్రి పార్లమెంట్ లో ఇచ్చిన బడ్జెట్ స్పీచ్ లో కూడా ఈ పథకం గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు.  

తన బడ్జెట్ స్పీచ్ లో మహిళల గురించి మాట్లాడుతూ ముద్రా పథకం కింద ప్రతి స్వయం సహాయక బృందం నుండి ఒక మహిళకు లక్ష రూపాయల ఋణం తీసుకోవడానికి అర్హత కల్పిస్తున్నామని కేంద్ర ఆర్ధిక మంత్రి తెలిపింది. అంతేకాని, బ్యాంకు అకౌంట్ ఉన్న ప్రతి మహిళకు లక్ష రూపాయులు అకౌంట్ లో వేస్తామని చెప్తూ ‘మహిళ స్వరోజ్గార్ యోజన’ పేరుతో ఎటువంటి పథకాన్ని ప్రకటించలేదు.

‘మహిళ స్వరోజ్గార్ యోజన’ పేరుతో ఎటువంటి కేంద్ర పథకం లేకున్నా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అదే పేరుతో ఆ రాష్ట్ర ప్రజల కొరకు ఎప్పటినుండో ఒక పథకం ఉంది. కానీ, ఆ పథకం కింద కేవలం అయిదు వేల రుపాయల వరకే మహిళలకు మరియు వికలాంగులకు వ్యాపారం పెట్టుకోవడానికి ఇస్తారు. ఆ పథకం గురించి మరిన్ని వివరాల కొరకు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, ‘మహిళ స్వరోజ్గార్ యోజన’ పేరుతో ఎటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం లేదు. ఖాతాలోకి లక్ష రూపాయలు రావు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll