Fact Check, Fake News, Telugu
 

కాలేజీలలో హిందూ ధర్మాన్ని బోధించకూడదని చెప్పే ఆర్టికల్ ‘30ఏ’ అసలు రాజ్యాంగంలోనే లేదు

0

హిందువుల పట్ల నెహ్రూ యొక్క మోసం యాక్ట్ 30 ఎ…పటేల్ మరణించిన వెంటనే, నెహ్రూ ఈ చట్టాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు…ఈ చట్టం ప్రకారం హిందువులు తమ ప్రైవేట్ కాలేజీలలో హిందూ ధర్మాన్ని బోధించకూడదు, హిందూ మతాన్ని బోధించడానికి కళాశాలలను ప్రారంభించకూడదు” అని చెప్తూ, ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రాజ్యాంగంలోని ఆర్టికల్ 30ఏ ప్రకారం హిందువులు తమ ప్రైవేట్ కాలేజీలలో హిందూ ధర్మాన్ని బోధించకూడదు.

ఫాక్ట్: అసలు రాజ్యాంగంలో ‘30ఏ’ అనే ఆర్టికలే లేదు. అంతేకాదు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 (1, 1A మరియు 2) కూడా మైనారిటీల హక్కులకు (‘Right of minorities to establish and administer Educational institutions’) సంబంధించినది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన ఆర్టికల్ 30ఏ గురించి భారత రాజ్యాంగంలో వెతకగా, అసలు రాజ్యాంగంలో ‘30ఏ’ అనే ఆర్టికలే లేదని తెలుస్తుంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 30 (1), 30 (1A), మరియు 30 (2) ఉన్నాయి. కానీ, ఆ ఆర్టికల్స్ మైనారిటీల హక్కులకు (‘Right of minorities to establish and administer Educational institutions’) సంబంధించినవి.

ఆర్టికల్ 30 (1) అన్నీ మైనారిటీలకు (మతం లేదా భాష ఆధారంగా) విద్యా సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. 2004 లో స్థాపించబడిన ‘నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ (NCMEI)’ ఆర్టికల్ 30 లోని మైనారిటీల హక్కులుకు కాపాడుతుంది. ఈ అంశం పై మరిన్ని వివరాల కోసం ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

రాజ్యాంగ అసెంబ్లీ లో ఈ అంశం పై జరిగిన చర్చను ఇక్కడ చదవొచ్చు.

చివరగా, కాలేజీలలో హిందూ ధర్మాన్ని బోధించకూడదని చెప్పే ఆర్టికల్ ‘30ఏ’ అనేది అసలు రాజ్యాంగంలోనే లేదు.

Did you watch our new Episode of the DECODE series?

Share.

About Author

Comments are closed.

scroll