Fake News, Telugu
 

భారతీయ శిక్షాస్మృతిలో 295(1), 502(2) సెక్షన్లు లేవు; IPC 295, 295A సెక్షన్లు అన్ని మతాలకు సంబంధించినవి, ప్రత్యేకంగా హిందూ మతం కోసం కాదు

0

“హిందూ మతంను దూషిస్తే IPC 295(1), 502(2) సెక్షన్ల క్రింద కేస్ నమోదు చేయవచ్చు” అని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: హిందూ మతంను దూషిస్తే IPC 295(1), 502(2) సెక్షన్ల క్రింద కేస్ నమోదు చేయవచ్చు.

ఫాక్ట్: అసలు 295(1), 502(2) సెక్షన్లు భారతీయ శిక్షాస్మృతిలో/ ఇండియన్ పీనల్ కోడ్ (IPC) లో లేనే లేవు. IPC 295, 295A సెక్షన్లు మతసంబంధమైన అపరాధముల గురించి తెలుపుతున్నవి. ప్రత్యేకంగా హిందూ మతం గురించి అని కాకుండా, అన్ని మతాలకు సంబంధించింది. IPC 502 సెక్షన్ మతానికి సంబంధించింది కాదు, పరువు నష్టానికి సంబంధించింది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.        

అసలు 295(1), 502(2) సెక్షన్లు భారతీయ శిక్షాస్మృతిలో/ ఇండియన్ పీనల్ కోడ్ (IPC) లో లేవు.

IPC 295, 295A సెక్షన్లు మతసంబంధమైన అపరాధములను గురించి తెలుపుతున్నవి. ప్రత్యేకంగా హిందూ మతం గురించి అని కాకుండా, అన్ని మతాలకు సంబంధించింది.

ఏ వర్గమువారి మతమునైనను అవమానపరచవలెననే ఉద్దేశముతో ఆరాధనాస్థలమును పాడుచేయుట లేక అపవిత్రము” చేసినప్పుడు సెక్షన్ 295 వర్తిస్తుంది. 

ఏ వర్గమువారి మతమునైనను, మత విశ్వాసములనైనను అవమానపరుచుట ద్వారా మత విషయకముగా వారి మనస్సుకు బాధ కలిగించు ఉద్దేశముతో బుద్ధిపూర్వకమైన, విద్వేషపూర్వకమైన కార్యములు” చేసినప్పుడు సెక్షన్ 295A వర్తిస్తుంది.

IPC Sec 502 మతానికి సంబంధించింది కాదు, పరువు నష్టానికి సంబంధించింది. “పరువునష్టము కలిగించు విషయమును కలిగినట్టిదై, ముద్రింపబడిన లేక నగిషీ చెక్కబడిన ఏదైన వస్తువును విక్రయించుట.”

చివరగా, భారతీయ శిక్షాస్మృతిలో 295(1), 502(2) సెక్షన్లు లేవు; IPC 295, 295A సెక్షన్లు అన్ని మతాలకు సంబంధించినవి, ప్రత్యేకంగా హిందూ మతం కోసం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll