Fake News, Telugu
 

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీతో టచ్‌లో ఉన్నారు అని షేర్ చేస్తున్న రిపబ్లిక్ టీవీ స్క్రీన్ షాట్ ఫేక్

0

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీతో టచ్‌లో ఉన్నారు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మద్దతుగా రిపబ్లిక్ టీవీ వార్త కథనం స్క్రీన్ షాట్ ఒకటి షేర్ చేస్తున్నారు.ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీతో టచ్‌లో ఉన్నారు.

ఫాక్ట్(నిజం): కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీతో టచ్‌లో ఉన్నారు అని చెప్పడానికి ఆధారాలు లభించలేదు. పలు రిపోర్ట్స్ ప్రకారం మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ బీజేపీతో టచ్‌లో ఉన్నారు అని చెప్తూ రిపబ్లిక్ టీవీ యొక్క నకిలీ స్క్రీన్‌షాట్‌లు వైరల్ కాగా, దీనిపై రిపబ్లిక్ టీవీ స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. ఇదే అంశంపై రిపబ్లిక్ టీవీ X పోస్టు ద్వారా స్పందిస్తూ ‘తమ బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్‌ని మార్ఫింగ్  చేస్తూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేసినట్లు తమ దృష్టికి వచ్చింది’ అని తెలిపింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

గత కొన్ని వారాలుగా, కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీని వీడారు. మహారాష్ట్రకు చెందిన మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవరా మహారాష్ట్రలో బీజేపీ మిత్రపక్షమైన ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు, ఆ వెంటనే మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. కొన్ని రోజులగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ బీజేపీలో చేరుతున్నారు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా బీజేపీ పార్టీలో చేరుతున్నారు అని చెప్తూ అర్థం వచ్చేలా ఉన్న పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వైరల్ క్లెయిమ్ గురించి మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీతో టచ్‌లో ఉన్నారు అని చెప్పడానికి ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు. ఒక వేళ ఇలాంటి ఏదైనా చర్చ మల్లికార్జున్ ఖర్గే, బీజేపీ మధ్య జరిగి ఉంటే మీడియా ఖచ్చితంగా రిపోర్ట్ చేసేది.

ఈ క్రమంలోనే మాకు 18 ఫిబ్రవరి 2024న ఫ్రీ ప్రెస్ జర్నల్ (Free Press Journal­) ప్రచురించిన వార్త కథనం లభించింది. ఈ కథనం ప్రకారం ఖర్గే, రాహుల్ బీజేపీతో టచ్‌లో ఉన్నారు అని చెప్తూ రిపబ్లిక్ టీవీ యొక్క నకిలీ స్క్రీన్‌షాట్‌లు వైరల్ కాగా, దిని పై రిపబ్లిక్ టీవీ ఛానెల్ స్పష్టత ఇచ్చినట్లు తెలిపింది.

ఇదే విషయం గురించి రిపబ్లిక్ టీవీ అధికారిక X(ట్విట్టర్) పరిశీలించగా, 18 ఫిబ్రవరి 2024న రిపబ్లిక్ టీవీ ఇదే అంశంపై  స్పందిస్తూరిపబ్లిక్ టీవీ బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్‌ని మార్ఫింగ్  చేస్తూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేసినట్లు మా దృష్టికి వచ్చింది. మా ఆంగ్ల వార్తా ఛానెల్ ద్వారా ధృవీకరించబడిన వార్తలను ప్రసారం చేయడానికి ఈ అధికారిక రిపబ్లిక్ హ్యాండిల్  మాత్రమే ఏకైక వేదిక. రిపబ్లిక్ బ్రాండ్ లోగోను ఉపయోగించి ఫేక్ న్యూస్ సర్క్యులేట్ కాకుండా చూసేందుకు మేము సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో కలిసి పని చేస్తున్నాము “ అని ప్రకటన చేసింది. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీతో టచ్‌లో ఉన్నారు అని రిపబ్లిక్ టీవీ రిపోర్ట్ చేయలేదు అని నిర్థారించవచ్చు.

చివరగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీతో టచ్‌లో ఉన్నారు అని షేర్ చేస్తున్న రిపబ్లిక్ టీవీ స్క్రీన్ షాట్ ఫేక్

Share.

About Author

Comments are closed.

scroll