Fake News, Telugu
 

ఈ వీడియోలో యోగా చేస్తూ కనిపిస్తున్నది నరేంద్ర మోదీ కాదు.

0

ఒక వ్యక్తి యోగా చేస్తున్న పాత బ్లాక్ అండ్ వైట్ వీడియోని చూపిస్తూ ఇది నరేంద్ర మోదీ యుక్త వయసులో యోగా చేస్తున్న వీడియో అని చేప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నరేంద్ర మోదీ యుక్త వయసులో యోగా చేస్తున్న బ్లాక్ అండ్ వైట్ వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో యోగా చేస్తూ కనిపించేది ప్రముఖ యోగా టీచర్ BKS అయ్యంగార్. ఒక తెలుగు భక్తి ఛానల్ అయ్యంగార్ పై రూపొందించిన డాక్యుమెంటరీలో పోస్టులో ఉన్న విజువల్స్ లాంటివే చూడొచ్చు. 2013లో వాషింగ్టన్ లో జరిగిన యోగాకి సంబంధించిన ఎక్సిబిషన్ లో BKS అయ్యంగార్ మరియు కృష్ణమాచార్య కి సంబంధించిన డాక్యుమెంటరీ ప్రదర్శించారు, ఈ డాక్యుమెంటరీలో పోస్టులో ఉన్న వీడియోలోని విజువల్స్ లాంటివే ప్రదర్శించారు. ఈ వీడియోకి మోదీకి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇలాంటి విజువల్స్ ఒక తెలుగు భక్తి ఛానల్ ప్రసిద్ధ యోగా టీచర్ అయిన BKS అయ్యంగార్ పై రూపొందించిన డాక్యుమెంటరీలో కనిపించాయి. ఈ డాక్యుమెంటరీ ప్రకారం ఈ విజువల్స్ అయ్యంగార్ యుక్త వయసులో యోగా చేస్తున్నవి.

భక్తి ఛానల్ డాక్యుమెంటరీ ఆధారంగా యూట్యూబ్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా అచ్చం పోస్టులో ఉన్న వీడియో లాంటిదే వీడియో ఒకటి కనిపించింది, ఈ వీడియో టైటిల్ ‘Krishnamacharya & B.K.S. Iyengar in 1938 with Yoga Sutras, Part 1of 6’ అని ఉంది. పోస్టులో ఉన్న వీడియోలోని విజువల్స్ ని పోలిన చాలా ఫోటోలు మరియు వీడియోలు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి.

గూగుల్ సెర్చ్ ద్వారా 2013లో వాషింగ్టన్ లో జరిగిన యోగాకి సంబంధించిన ఎక్సిబిషన్ లో BKS అయ్యంగార్ మరియు కృష్ణమాచార్య కి సంబంధించిన డాక్యుమెంటరీ ప్రదర్శించారన్న తెలిపిన వార్తా కథనం ఒకటి దొరికింది. ఈ కథనం ఆధారంగా యూట్యూబ్ లో కీవర్డ్ చేయగా ఆ ఎక్సిబిషన్ సంబంధించిన వీడియో దొరికింది, ఈ వీడియో లో పోస్టులో ఉన్న వీడియోలోని విజువల్స్ లాంటివి చూడొచ్చు. వీటన్నిటి ద్వారా ఈ వీడియోలో ఉన్నది యోగ టీచర్ B.K.S. అయ్యంగార్ అని మోదీ కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

చివరగా, ఈ వీడియోలో యోగా చేస్తూ కనిపించేది మోదీ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll