కొంతమంది మహిళలు ప్లాస్టిక్ బాగ్స్ లో ఉమ్ము వేసి ఇళ్లల్లోకి విసిరేస్తున్న వీడియోని ఫేస్బుక్ లో పోస్ట్ చేసి ఆ వీడియోలోని మహిళలు ముస్లింలు అని ప్రచారం చేస్తున్నారు. ఆ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో విశ్లేషిద్దాం.

క్లెయిమ్: ప్లాస్టిక్ బాగ్స్ లో ఉమ్ము వేసి ఇళ్లల్లోకి విసిరేస్తున్న ముస్లిం మహిళల
వీడియో.ఫాక్ట్ (నిజం): ఆ వీడియో గురించి ‘FACTLY ‘ గౌరవ్ యాదవ్ (కోటా సిటీ యొక్క సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) ని సంప్రదించగా, ఆ వీడియో లో ఉన్న మహిళలు ముస్లింలు కాదని స్పష్టం చేసాడు. వాళ్ళు ‘హిందూ బావారి’ అనే కులానికి చెందినవారని తెలిపాడు. కావున, ఆ క్లెయిమ్ తప్పు.
ఆ వీడియోలో చూపించిన సంఘటన గురించి వెతికితే, సెర్చ్ రిజల్ట్స్ లో ఆ వీడియో కి సంబంధించి ‘ANI’ మీడియా సంస్థ పెట్టిన ట్వీట్ కనిపించింది. ఆ ట్వీట్ ద్వారా, ఆ సంఘటన కోటా లోని వల్లభవాడి దగ్గర జరిగింది అని తెలిసింది. ఇంకో ట్వీట్ లో ఆ మహిళలని పోలీసులు కస్టడీ లోకి తీసుకున్నారని, ఇంటరాగేషన్ ద్వారా ఆ సంఘటన COVID-19 ని వ్యాప్తి చేయడానికి చేసింది కాదని వుంది. అంతేకాక, ఆ వీడియోలో మహిళలు భిక్షం ఎత్తుకునే వాళ్లని, వాళ్లకు అక్కడ డబ్బులు రాకపోయేసరికి వాళ్ళ కోపాన్ని చూపించడానికి ఆలా చేసారని తెలిసింది.
ఆ వీడియో గురించి ‘FACTLY ‘ గౌరవ్ యాదవ్ (కోటా యొక్క సూపరింటెండెంట్ అఫ్ పోలీస్) ని సంప్రదించగా, ఆ వీడియో లో ఉన్న మహిళలు ముస్లింలు కాదని స్పష్టం చేసాడు. వాళ్ళు ‘హిందూ బావారి’ అనే కులానికి చెందినవారని తెలిపాడు. ఆ మహిళల పేర్లను ‘Times Now News’ ఆర్టికల్ లో చూడవచ్చు.

ఆ సంఘటన గురించిన మరింత సమాచారాన్ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఆ వీడియోలో ప్లాస్టిక్ కవర్లలో ఉమ్మువేసి ఇళ్లల్లోకి విసిరేస్తున్న మహిళలు ముస్లింలు కాదు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?