Fake News, Telugu
 

వాట్సాప్ లో మూడు టిక్కులు అసలు రావు. మూడు టిక్కుల గురుంచి వైరల్ అవుతున్న వీడియోలో చెప్పింది అబద్ధం

0

వాట్సాప్ లో మూడు టిక్కులు వస్తే ఎంత డేంజరో తెలుసా అంటూ ఒక వ్యక్తి మాట్లాడుతున్న వీడియో ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియో ప్రకారం, ఒక వ్యక్తి పంపిన వాట్సాప్ మెసేజ్ కి మూడు నీలం రంగు టిక్ మార్కులు వస్తే, ఆ మెసేజ్ ప్రభుత్వం దృష్టికి వెళ్ళినట్టు; రెండు నీలం రంగు టిక్కులు మరియు ఒక ఎరుపు రంగు టిక్ వస్తే, ఆ మెసేజ్ విషయంగా ప్రభుత్వం చర్య తీసుకోగలదు; ఒక నీలం రంగు టిక్ మరియు రెండు ఎరుపు రంగు టిక్ మార్కులు వస్తే, ప్రభుత్వం మెసేజ్ ని పరీక్షిస్తుంది; మూడు ఎరుపు రంగు టిక్ లు వస్తే, ప్రభుత్వం మెసేజ్ పంపిన వ్యక్తి పైన చర్యలు తీస్కుంది మరియు అతనికి కోర్ట్ నుండి ఏ సమయంలోనైన సుమ్మన్లు రావొచ్చు. కానీ, ‘FACTLY’ విశ్లేషణ లో అసలు వాట్సాప్ లో మూడు టిక్కులు రావు అని తేలింది. అంతేకాదు, వాట్సాప్ లో మెసేజ్లు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ తో ప్రొటెక్ట్ చేయబడుతాయి. కాబట్టి ప్రభుత్వం వాటిని చదవలేదు. ఇంతకముందు, ఇదే మెసేజ్ వైరల్ అయినప్పుడు FACTLY రాసిన ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. FACTLY ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్ – https://factly.in/

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll