‘ప్రయత్నం తో పాటుగా ప్రోత్సాహం ఉంటె నీచమైన స్తితి నుండి ఉన్నత స్థాయిని అధికమించవచ్చంటూ నిరూపించుకున్న ఒక యువతి’ అంటూ ఫేస్బుక్ లో పెట్టిన ఒక కొలేజ్ ని చాలా మంది షేర్ చేస్తున్నారు. పోస్టు లో పెట్టిన ఫోటోల గురించి చెప్పిన విషయం లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్దాం.
క్లెయిమ్: పేద స్థితి (2004) నుండి పోలీసు అధికారిగా(2018) ఎదిగిన ఒక మహిళ కి సంబంధించిన ఫోటోలు.
ఫాక్ట్ (నిజం): ఫోటోల్లో ఉన్నది ఇద్దరు వేరు వేరు వ్యక్తులు. అందులోని అమ్మాయి ఫోటోని 2015 లో పాకిస్తాన్‌లో తీయగా, పోలీసు యూనిఫాంలో ఉన్న మహిళ దక్షిణ భారతదేశానికి చెందిన ఒక నటి. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని అమ్మాయి ఫోటో ని క్రాప్ చేసి, దానిని యాండెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, సెర్చ్ రిజల్ట్స్ లో ఒక ఫోటోగ్రాఫర్ యొక్క ఫ్లికర్ ఖాతా లింక్ వచ్చింది. వెబ్‌సైట్‌లో ఆ ఫోటో క్రింద ఉన్న వివరణ ద్వారా, ఆ ఫోటోని సోహైల్ కర్మానీ అనే ఫోటోగ్రాఫర్ 2015 లో పాకిస్తాన్ లో తీసినట్లుగా తెలుస్తుంది. కాబట్టి, ఫోటో 2004 లో తీయబడిందనే విషయం తప్పు.
పోస్ట్ లో పోలీసు దుస్తుల్లో ఉన్న మహిళ ఫోటో ని క్రాప్ చేసి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అలాంటి చాలా ఫోటోలు సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చాయి. ఆ ఫోటోలు “తిమిరు పుడిచవన్” అనే తమిళ చిత్రం లో నివేత పెతురాజ్ యొక్క స్టిల్స్. ఆ చిత్రంలో నివేత పెతురాజ్ ప్రధాన నటి, అందులో ఆమె ఒక పోలీసు అధికారి పాత్రను పోషించింది.
చివరగా, యూనిఫాంలో ఉన్న మహిళ ఒక భారతీయ నటి మరియు ఫోటో లోని అమ్మాయి పాకిస్తాన్ దేశస్థురాలు. అవి రెండు వేరు వేరు వ్యక్తుల ఫోటోలు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: యూనిఫాంలో ఉన్న మహిళ ఒక భారతీయ నటి మరియు ఫోటో లోని అమ్మాయి పాకిస్తాన్ దేశస్థురాలు - Fact Checking Tools | Factbase.us