COVID-19 సోకి మరణించిన వారి మృతదేహాలను కొన్ని దేశాలు సముద్రాలలోకి విసిరేస్తున్నాయనే క్లెయిమ్ తో మృతదేహాలు ఒడ్డుకు వచ్చిన వీడియోను సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు. కానీ, ఆ వీడియో ఐదేళ్ల ముందు తీసినది అని FACTLY విశ్లేషణలో తేలింది. ఆగస్టు 2014 లో ఆఫ్రికాకు చెందిన వలసదారులతో ఉన్న ఒక పడవ యూరప్ కు వెళ్లే దారిలో లిబియా తీరంలో మునిగిపోయింది. ఆ వీడియో ఆ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలు లిబియాలోని బీచ్ ఒడ్డుకు కొట్టుకు రావడం చూపిస్తుంది.
సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. న్యూస్ వీడియో – https://www.youtube.com/watch?v=Su9HqWj1Wt4
2. న్యూస్ ఆర్టికల్ – https://www.euronews.com/2014/08/25/dozens-of-migrant-bodies-are-washed-ashore-in-libya
3. న్యూస్ ఆర్టికల్ – https://arabi21.com/story/771519
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?